విజయవాడ

నాన్ ప్లాన్ గ్రాంట్లు మంజూరు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 6: విజయవాడ నగరపాలక సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను మంజూరు చేయాలని నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ కోరారు. సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్‌ను కలిసిన శ్రీ్ధర్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రభుత్వం నుంచి నాన్‌ప్లాన్ గ్రాంట్ 43.74 కోట్ల రూపాయలు రావాల్సి ఉందన్నారు. పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియం అభివృద్ధితోపాటు కృష్ణా పుష్కరాలకు నగరంలో చేపట్టిన రోడ్డు విస్తరణలో ఇళ్ల స్థలాలు కోల్పోయియన బాధితులకు సుమారు 17 కోట్ల రూపాయలను ఇవ్వాల్సి ఉందని, వాటిని కూడ మంజూరు చేయాలని కోరారు.

బిపిఈడి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్
* పాఠశాలలు, కళాశాలల్లో క్రీడలు తప్పనిసరి
* సర్ట్ఫికెట్ల ప్రదానోత్సవంలో కృష్ణా వర్సిటీ విసి రామకృష్ణారావు
విజయవాడ (స్పోర్ట్స్), మార్చి 6: వ్యాయామ విద్యలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న బిపిఈడి విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉందని కృష్ణా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎస్.రామకృష్ణారావు అన్నారు. రానున్న రోజుల్లో ప్రతి పాఠశాల, కళాశాలలో క్రీడలను ప్రభుత్వం తప్పనిసరి చేస్తోందన్నారు. అందులో భాగంగానే నూతన క్రీడా విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మచిలీపట్నంలో నిర్వహించిన అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో సేవలందించిన నున్న వికాస్, విజయ బిపిఈడి కళాశాల విద్యార్థులకు సర్ట్ఫికెట్ల ప్రదానోత్సవం విజయవాడ రూరల్ మండలం నున్నలోని వికాస్ విద్యాసంస్థల ఆవరణలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన వైస్ చాన్సలర్ రామకృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇప్పుడు వ్యాయామ కోర్సులు చేస్తున్నవారికి తప్పకుండా మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో వ్యవహరించాలని, ఏ సమయంలో ప్రతికూలంగా ఆలోచించకూడదని సూచించారు. కృష్ణా యూనివర్సిటీ కూడా క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, యూనివర్సిటీ నిర్వహించే ప్రతి టోర్నమెంట్‌లోనూ బిపిఈడి విద్యార్థుల సహకారం ఉండటం హర్షణీయమన్నారు. అనంతరం వికాస్ బిపిఈడి కాలేజి ఆధ్వర్యంలో వైస్ చాన్సలర్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వికాస్ విద్యాసంస్థల చైర్మన్ నరెడ్ల నర్సిరెడ్డి, కరస్పాండెంట్ నరెడ్ల సత్యనారాయణరెడ్డి, కృష్ణా యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎన్.శ్రీనివాస్, వికాస్ బిపిఈడి కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాజు, అధ్యాపకులు ఉదయ్‌కుమార్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.