బిజినెస్

వొడాఫోన్‌లో పిరామల్ వాటా రెట్టింపు

  • 05/02/2012

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: నిన్న మొన్నటి వరకు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడిన ప్రముఖ విదేశీ టెలికాం సంస్థ వొడాఫోన్‌కు ఇప్పుడంతా మంచి రోజులే నడుస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన ఈ టెలికాం సంస్థ ఇటీవలే సుమారు రూ.11,000 కోట్ల పన్ను భారం నుంచి విముక్తి పొందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వొడాఫోన్ (్భరత విభాగం)లో తన వాటాను రెట్టింపు చేసుకునేందుకు ప్రముఖ ఔషధాల తయారీ సంస్థ పిరామల్ హెల్త్‌కేర్ అంగీకరించింది. ఈ క్రమంలోనే రూ.3,007 కోట్ల రూపాయలతో దాదాపు 5.5 శాతం వాటాను తీసుకుంటున్నట్లు శనివారం ఓ ప్రకటనలో వొడాఫోన్ గ్రూప్ తెలిపింది. వొడాఫోన్‌లోని ఇటిహెచ్‌ఎల్ కమ్యూనికేషన్స్ నుంచి కొనుగోలు చేసేందుకు ఈ ఒప్పందం ఖరారైనట్లు వోడాఫోన్ ప్రకటనలో పేర్కొంది. కాగా, ఇంతకుముందే ఈ సంస్థకు 5.5 శాతం వాటా ఉండగా, ఆ మొత్తాన్నీ గతంలో రూ.2,900 కోట్ల రూపాయలు చెల్లించి దక్కించుకుంది.

Add new comment

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading