విజయనగరం

ఓటరు జాబితా తయారీకిసహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రాజకీయ పక్షాలను కోరిన పరిశీలకుడు విజయ్‌కుమార్
విజయనగరం, నవంబర్ 27: జిల్లాలో ఓటర్ల జాబితాను పక్కాగా తయారు చేయడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఎలక్టోరల్ రోల్ పరిశీలకుడు, మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సజావుగా జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీ ప్రతినిధులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిశీలకుడు పరిగణలోకి తీసుకుని ఓటర్ల జాబితాను పక్కాగా రూపొందించడానికి జిల్లా ఎన్నికల యాంత్రాంగానికి సూచనలు చేసారు. విజయనగరం మున్సిపాలిటీలోని 38, 40 వార్డులు, పాచిపెంట ప్రాంతంలో ఓటర్ల నమోదుపై ప్రత్యేకదృష్టి పెట్టాలని, నఖిలీ ఓటర్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఒకప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్లిన ఓటర్లను సరైన రీతిలో నమోదు చేయాలని అన్నారు. ఓటర్లు నమోదుకు ప్రజలను చైతన్య చేయటానికి నిర్వహించే ప్రచార తేదీ లు ముందుగా తెలపాలని ఆయ న అధికారులను ఆదేశించారు. ఓటరు నమోదులో 18నుండి 19 సంవత్సరాల మధ్య వయసుగల యువతపై ప్రత్యేకదృష్టి సారించాలని చెప్పారు. జిల్లా ఎన్నికల ఆధికారి కలెక్టర్ ఎంఎం నాయక్ మాట్లాడుతూ 18-19 సంవత్సరం మధ్య వయసుగల యువత జిల్లాలో 20145మంది నమోదయ్యారని, ఈ సంఖ్య ఇంకా పెరగవలసిన అవసరం ఉందని చెప్పారు. కళాశాలల్లో చదువుతున్న యువతపై ప్రత్యేకదృష్టి సారించాలని ఆదేశించారు. చనిపోయిన ఓటర్లు, వలస వెళ్లిన ఓటర్లు, రెండుసార్లు నమోదు అయిన ఓటర్లపై దృష్టి సారించాలని వివరించారు. పివిసి కార్డులకు కొరత లేదని, ఫోటో ఓటరుగుర్తింపు కార్డులు అడిగిన వెంటనే అందజేయాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రామారావు, డిఆర్‌ఓ జితేంద్ర, విజయనగరం, పార్వతీపురం ఆర్‌డిఓలు శ్రీనివాసమూర్తి, గోవిందరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, తొమ్మిది నియోజకవర్గాల ఎలక్టోరల్ అధికారులు పాల్గొన్నారు.
నిరంతరంగా ఓటర్ల నమోదు
ఎన్నికలతో సంబంధం లేకుండా ఓటరు నమోదును రాష్ట్రంలో నిరంతర ప్రక్రియగా చేపడుతున్నారని ఎలక్టోరల్ రోల్ ప్రత్యేక పరిశీలకుడు విజయ్‌కుమార్ తెలిపారు. రాజకీయ పార్టీలతో, అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలలో ఓటర్ల నమోదు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. జిల్లాలో కొత్తగా నమోదు అయిన తొమ్మిది వేలకు పైగా ఓటర్లను అప్‌లోడ్ చేయాల్సి ఉందని అన్నారు. పట్టణాలలో ఓటర్ల నమోదును శాస్ర్తియంగా జరపవలసి ఉందని, ఈ విషయంలో అధికారులకు తగిన సూచనలు జారీచేసామని చెప్పారు. ఓటర్ల జాబితాను సరిచేయడానికి చర్యలు చేపట్టామని, ఈ విషయంలో రాజకీయ పార్టీల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామని అన్నారు.