విశాఖపట్నం

తలసెమియా, ఎనిమీయా రోగులకు ఉచిత సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 11:ఎనిమీయా, తలసెమియా వంటి వ్యాధులతో బాధపడే రోగులకు డాక్టర్ ఎన్‌టిఆర్ వైద్యసేవా ట్రస్ట్ ద్వారా ఎటువంటి ఫీజులు లేకుండానే వైద్యసేవలు అందిస్తున్నట్టు కెజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్ స్పష్టంచేశారు. ఆదివారం ఆయన ఛాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాధులతో బాధపడే వారికి ఆర్థిక భారం లేకుండా ఈ సదుపాయం కల్పించామన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 64 మంది రోగులు కెజిహెచ్‌లో చికిత్స పొందారన్నారు. అలాగే కొంతమంది రోగులకు అవసరమైన 5 నుంచి 20 సీసాల రక్తాన్ని సమకూర్చామన్నారు. డయాగ్నోస్టిక్, ట్రీట్‌మెంట్ సౌకర్యాలనున్నాయన్నారు. జిల్లాస్థాయిలో కేంద్రాలు ఏర్పాటు చేసి కౌనె్సలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఫీడియాడ్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ పి.పద్మలత, మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ కె.ఇందిరాదేవి, డాక్టర్ ఎంవిజయశంకర్, కెజిహెచ్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె.శ్యామలదేవి తదితరులు పాల్గొన్నారు.