విశాఖ

ప్రమాదస్థాయిలో కోనాం రిజర్వాయర్ నీటిమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీడికాడ, సెప్టెంబర్ 13: మండలంలోని కోనాం రిజర్వాయర్ నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కు పనసగెడ్డ, కొండగెడ్డ, పసుపుగెడ్డ పొంగి ప్రవహించడంతో రిజర్వాయర్‌లోకి కొత్తనీరు వచ్చి చేరుతుంది. రిజర్వాయర్‌లో నీటి మట్టం మొత్తం 101.25మీటర్లు కాగా ప్రస్తుతం రిజర్వాయర్‌లో 100.10మీటర్లు నీరు ఉంది. రిజర్వాయర్‌లో నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరడంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసారు. ప్రస్తుత రిజర్వాయ ర్ నుండి ఎగువ కాలువ ద్వారా 30క్యూసెక్కులు దిగువ కాలువ ద్వారా 70 కూసెక్కుల నీరు రైతులకు అందిస్తున్నారు.