విశాఖపట్నం

అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 26: గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలం అవుతోంది. ఈ నెల 21 నుంచి 25 వరకూ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీటమునిగాయని, పలు మండలాల్లో చోటుచేసుకున్న ప్రమాదాల్లో 9 మంది మృతి చెందగా, ఒకరు గల్లంతైనట్టు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వారం రోజుల వ్యవధిలో హుకుంపేట, అనంతగిరి, కశింకోట, జి మాడుగుల, కోటవురట్ల, దేవరాపల్లి, అచ్యుతాపురం, చోడవరం, మాడుగుల మండలాల్లో 10 మంది మృతి చెందారు. ఒకరి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. భారీ వర్షాలకు రిజర్వాయర్లలోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు తెలిపారు. భారీ వర్షాలతో పల్లపు ప్రాంతాలు జలమయం కావడంలో జిల్లాలో చోడవరం, అనకాపల్లి, దేవరాపల్లి, కె కోటపాడు, బుచ్చెయ్యపేట, అచ్యుతాపురం మండలాల్లో సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి బాధితులను తరలించినట్టు వెల్లడించారు. ఇప్పటి వరకూ జిల్లాలో 18 పక్కా ఇళ్లు, 74 పూరిళ్లు నేలమట్టమయ్యాయని, మరో 316 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. భారీ వర్షాలతో జిల్లాలోని రిజర్వాయర్లలోకి వరద నీరు వచ్చి చేరుతోందని తెలిపారు. ఇప్పటికే సాధారణ నీటి మట్టానికి చేరువగా ఉన్న రైవాడ, కోనాం, పెద్దేరు, వరాహ జలాశయాల నుంచి నీటిని దిగువకు విచిచిపెడుతున్నామన్నారు. రైవాడ జలాశయం నుంచి భారీ ఎత్తున 3,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపట్టగా, కోనాం, పెద్దేరు రిజర్వాయర్ల నుంచి 660 క్యూసెక్కులు, వరాహ రిజర్వాయర్ నుంచి 150 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడిచిపెడుతున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకూ భారీ వర్షాలకు 207 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బి రహదార్లు ద్వంసమైనట్టు తెలిపారు. వీటిని తాత్కాలిక ప్రాతిపదికన పునరుద్ధరించేందుకు రూ.5.1 కోట్లు, శాశ్వత పనులకు రూ.22.5 కోట్లతో ప్రతిపాదించామన్నారు. అలాగే పంచాయతీరాజ్ విభాగంలో 10 చెరువులకు గండ్లు పడినట్టు తెలిపారు. చెరువుల్లో ప్రమాద కర స్థాయిలో నీరు చేరుకోగా, గట్లు తెగే ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలుగా ఇసుక బస్తాలను సిద్ధ చేశామన్నారు. ఏజెన్సీ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఇక్కడ వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ఎటువంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకూ జిల్లాలోని 13 మండలాల్లోని 101 గ్రామాల్లో 3,437 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని, ఇది ప్రాధమిక అంచనా మాత్రమేనని తెలిపారు.
కంట్రోల్ రూం ద్వారా పరిస్థితి సమీక్ష
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. కలెక్టరేట్‌లో అన్ని విభాగాలతో కూడిన ఒక ప్రత్యేక బృందాన్ని నియమించి కంట్రోల్ రూంను మానిటర్ చేస్తున్నట్టు తెలిపారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, వ్యవసాయ, వైద్య ఆరోగ్య, జివిఎంసి, పోలీసు, అగ్నిమాపక శాఖల కీలక సిబ్బంది కంట్రోల్ రూంలో ఉండి, పరిస్థితులను ఎప్పటికప్పుడు క్రోఢీకరించి, తమ, తమ శాఖలకు నివేదిస్తారని, తద్వారా సహాయ, పునరావాస చర్యలు తీసుకునేందుకు వీలవుతుందన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూంకు టోల్ ఫ్రీ నెంబర్ 180042500002 నెంబర్ లేదా, 1077 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. అలాగే డివిజన్, మండల స్థాయిలో కూడా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి తాజా పరిస్థితులను పరిశీలించే ఏర్పాటు చేశామన్నారు. క్షేత్ర స్థాయిలో వరద సహాయ చర్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.