విశాఖపట్నం

వుడాకు రాష్టస్థ్రాయి అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 26: జిల్లాలోని వివిధ ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్న విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా)కు అరుదైన గుర్తింపు లభించింది. వివిధ పర్యాటక ప్రాంతాలను ఉత్తమంగా నిర్వహిస్తున్నందుకు పౌరసేవా విభాగంలో వుడాకు పర్యాటక అవార్డు లభించింది. హదూద్ తుపాను తరువాత జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు పూర్వ వైభవాన్ని తీసుకురావడంతో వుడా కీలకపాత్ర పోషించింది. కైలాసగిరి, విమానాశ్రయంలో పచ్చదనం పెంపు, ల్యాండ్ స్కేపింగ్ వంటి చేపట్టి అధికారుల, సందర్శకుల మన్ననలు పొందింది. ఇటీవలే సిటీ సెంట్రల్ పార్క్‌ను సుందరంగా తీర్చిదిద్దింది. వివిధ ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడంలో వెనుక వుడా వీసీ బాబూరావు నాయుడు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. పర్యాటక రంగంలో సేవలు అందిస్తున్న జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపికైనట్లు పర్యాటక శాఖ ప్రాంతీయ డైరెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు తెలిపారు. పర్యాటక ప్రదేశాలను ఉత్తమంగా నిర్వహిస్తున్నందుకు వుడాకు, ఉత్తమ పర్యావరణ అనుకూల హోటల్ విభాగంలో పార్క్ హోటల్‌కు, ఉత్తమ స్టాండ్ ఎలోన్ రెస్టారెంట్‌గా టైకూన్ ఎంపికైనట్లు తెలిపారు. ఈ అవార్డులను మంగళవారం నిర్వహించే ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి అందచేయనున్నట్లు తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను రాజీవ్ స్మృతి భవన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలు సాయంత్రం 4.30 గంటల నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఆర్కే బీచ్‌లో కాళీమాత ఆలయం నుంచి వైఎంసిఎ వరకూ పర్యాటక నడకను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమయ్యే నడకలో నగర ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దివ్యాంగులకు అత్యంత అనుకూలమైన బీచ్ అని తెలిపారు.
బాధ్యతను మరింత పెంచింది
వుడాకు ఈ అవార్డు రావడం సంతోషకరమని విసి బాబూరావు నాయుడు అన్నారు. ఇది బాధ్యతలను మరింతగా పెంచుతుందన్నారు. ఇంజనీరింగ్, హార్టీకల్చర్, ప్లానింగ్ తదితర విభాగాల సమష్టి కృషి కారణంగా ఈ గుర్తింపు లభించిందన్నారు. విమానాశ్రయం ల్యాండ్ స్కేపింగ్, కైలాసగిరి, తెలుగు మ్యూజియం, పాండురంగాపురం పార్క్, అరకు సమీపంలోని పద్మాపురం గార్డెను, సిటీ సెంట్రల్ పార్క్ తదితరాలకు సందర్శకులు మరింతగా వచ్చేలా తీర్చిదిద్దామన్నారు. ఈ గుర్తింపు మరింతగా పని చేసేందుకు ఉత్సాహాన్ని, స్ఫూర్తిని ఇస్తుందని, అవార్డుకు ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజతలు అన్నారు.