విశాఖపట్నం

గడపకు గడపకు వెళుతూనే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గత నాలుగు నెలలుగా నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమం దాదాపూ 80 శాతం వరకూ పూర్తయింది. రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది జూన్ ఎనిమిదవ తేదీ నుంచి గడప గడపకు కార్యక్రమాన్ని వైకాపా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వైకాపా అధినేత జగన్ ప్రకటించారు. వాస్తవానికి ప్రజల్లో అధికార పార్టీ పట్ల ఉన్న అభిప్రాయమేంటన్నది తెలుసుకోవడం ఈ కార్యక్రమ ఆంతర్యం. దీన్ని అధికార పార్టీ ముందుగానే పసిగట్టినా, ప్రత్యర్థి పార్టీ కార్యక్రమాన్ని అడ్డుకోవడం మంచిదికాదన్న ఉద్దేశంతో ఆగిపోయింది. కానీ ఈ గడప గడపకు కార్యక్రమం ఇప్పుడు చాప కింద నీరులా మారింది. అధికార పార్టీకి ఎసరు తెచ్చేట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లకపోవడం, అందులోని లోపాలను వైకాపా అడ్వాంటేజ్‌గా తీసుకుంటోంది. ఉదాహరణకు రేషన్ బియ్యం విషయాన్ని తీసుకుందాం. ఒక కుటుంబంలోని సభ్యులందరి వేలి ముద్రలు తీసుకుంటారు. అందులో ఎవ్వరు వెళ్లినా రేషన్ ఇవ్వాల్సి ఉంది. కానీ చాలా చోట్ల ఇలా జరగడం లేదన్న విషయం వైకాపా దృష్టికి వచ్చిందట. కుటుంబంలో పలు చోట్ల కుటుంబంలో ఒక్క వ్యక్తికి మాత్రమే రేషన్ ఇచ్చి, మిగిలిన వారికి రేషన్ కట్ చేసినట్టు డీలర్లు చెపుతున్నట్టు వీరి దృష్టికి వచ్చింది. తమకు జరిగిన అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక లబ్దిదారులు మిన్నకున్నట్టు వైకాపా నేతలు చెపుతున్నారు. అలాగే, వికలాంగుల పించన్లను తొలగించడం, రేషన్ కార్డులో తప్పుగా నమోదైన వయసును ఆధారంగా తీసుకుని పించను తొలగించడం వంటి అనేక అంశాలపట్ల ప్రజల్లో అసంతృప్తి పేరుకుపోయినట్టు చెపుతున్నారు. అలాగే, ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి, నగరంలోని అనేక వార్డుల్లో తెలుగుదేశం నాయకులు ఒక్కో కుటుంబం నుంచి 25 నుంచి 50 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇళ్లు మంజూరైన తరువాత లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలన్న డిమాండ్ కూడా చేస్తున్నట్టు ప్రజలే వైకాపా నేతలకు వివరించారు. ఇది కూడా ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తున్నట్టు వైకాపా నాయకులు చెపుతున్నారు.
హోదా, జోన్‌పై స్పందన లేదట!
వైకాపా గడచిన నాలుగు నెలలుగా విశాఖ నగరంలో నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని, రైల్వే జోన్ మంజూరు కాలేదన్న విషయాలను ప్రస్తావించడం లేదట. దాని గురించి వైకాపా నేతలు గుచ్చి గుచ్చి ప్రశ్నించినా, పెద్దగా స్పందించడం లేదట.
ఇదే అదనుగా..
ప్రభుత్వం పట్ల ప్రజల్లో పేరుకుపోతున్న అసంతృప్తిని తమకు అనకూలంగా మలచుకునేందుకు వైకాపా వ్యూహ రచన చేస్తోంది. ప్రజల నుంచి ఏయే అంశాల్లో వ్యతిరేక వ్యక్తమవుతోందో పార్టీ అథినేతకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. మరో రెండు, మూడు నెలల్లో గడప గడపకు కార్యక్రమాన్ని పూర్తి చేసి, గతంలో రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పథకాలు అందిన తీరును తెలియచెపుతూ, ఇప్పుడు పథకాలు ఏవిధంగా విఫలమవుతున్నాయో చెప్పడానికి ఆ పార్టీ నాయకులు రంగం సిద్ధం చేస్తున్నారు.