విజయనగరం

ఆటో కార్మికులపై చిన్నచూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), సెప్టెంబర్ 29: ఆటోకార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటుచేయాలని ఎ ఐ ఎఫ్‌టియు (న్యూ) రాష్ట్ర అధ్యక్షుడు పెద్దన్న డిమాండ్ చేసారు. గురువారం పట్టణంలోని మెసానిక్ టెంపుల్‌లో జరిగిన రాష్ట్ర మహాసభలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటోకార్మికుల సంక్షేమం పట్ల చిన్నచూపు చూడటం తగదని హెచ్చరించారు. ఎన్నికల ముందర ఆటోకార్మికులు తన సోదరులుఅంటూ చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కేంద్రం కొత్తగా అమలుచేయ తల పెట్టిన నూతన రహదారి భద్రతా చట్టం ప్రతిపాదనలపై పెదవి విప్పకపోవడం శోచనీయమని అన్నారు. నూతన చట్టం అమలులోకి వస్తే ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగితే ఆటోకార్మికులపై తేరుకోలేని భారం ఫైన్ రూపంలో పడటమేకాకుండా జైలు శిక్షకు గురికావాల్సిరావడం అన్యాయ మని, ఇటువంటిచట్టాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. రోజులో పది గంటలు కష్టపడితే సంపాదించే ఆదాయాన్ని రవాణాశాఖ, పోలీసు అధికారుల తనిఖీలు, కేసులు పేరుతో విధించే చలానాలకు సరిపోతుందని , ఆటోకార్మికులపై ఈనేపధ్యంలోజరగుతున్న వేధింపులను ఆపాలని ఆయన డిమాండ్ చేసారు. ఆన్‌లైన్ విధానంవలన ఆటోకార్మికులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని కోరారు. ఆటోకార్మికులకు బ్యాడ్జి పొందడానికి కనీస విద్యార్హత ఎనిమిది చదివి ఉండాలనే నిబంధనను తొలగించాలని డిమాండ్ చేసారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంక్షేమ బోర్డు మాదిరిగా ఆటోకార్మికులకు కూడా సంక్షేమ బోర్డు నెలకొల్పి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని కోరారు. పావలా వడ్డీకి రుణాలు ఇవ్వాలని సూచించారు. జిల్లాలో వేల మందికి ఉపాధి కల్పించే జూట్ మిల్లులు మూపడినా విమానాల మంత్రి అశోక్‌గజపతిరాజుకు కనిపించకపోవడం శోచనీయమని పెద్దన్న ఎద్దేవా చేసారు. మేకిన్ ఇండియా పేరుతో ప్రధాని మోడీ దేశంలో మూత పడుతున్న పరిశ్రమలగురించి పట్టించుకోవడం లేదని రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ విమర్శించారు. జిల్లాలో మూతపడిన జూట్ పరిశ్రమలు తిరిగి తెరిపించే చర్యలు లేవని మరో మార్గంలేక ఆ కార్మకులు ఆటోలను నమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఆయిలు, ఇతరత్రా ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేసారు. ఆటోమొబైల్ సంస్ధలు, ఫైనాన్స్ కంపెనీలు నుండి కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగాలంటే పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి ఆదుకోవాలని సూచించారు. ఆటోకార్మికుల సమస్యలపై సంఘటిత పోరాటాల ద్వారా హక్కులు సాధించుకుంటామని ఎ ఐ ఎఫ్ టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోనీ ఆన్నారు. అంతకు ముందు మహాసభల సందర్భంగా పట్టణంలో ఆటోకార్మికులు ర్యాలీ నిర్వహించారు. మెసానిక్ టెంపుల్‌లో మహాసభల పతాకాన్ని ఆవిష్కరించారు. సాయంత్రం జరిగిన ప్రతినిధులు సభలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఎ ఐ ఎఫ్‌టియు రాష్ట్ర కమిటీ నూతన అధ్యక్షునిగా విజయనగరానికి చెందిన రెడ్డినారాయణరావు,ప్రధానకార్యదర్శిగా మచిలీపట్నానికి చెందిన సంతబాబు, ఉపాధ్యక్షునిగా అప్పలరాజురెడ్డి ఎన్నికయ్యారు. ఈకార్యక్రమంలో యూనియన్ నాయకులు బెహరాశంకరావు, డి వర్మ, దుర్గాప్రసాద్ ఆటోకార్మికులు పాల్గొన్నారు.