విశాఖపట్నం

పారిశుద్ధ్య పనులెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 30: మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి)లో పారిశుద్ధ్య పనుల కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియనుంది. ప్రస్తుతం నగరంలోని 72 వార్డులు, అనకాపల్లి, భీమునిపట్నం విలీన మున్సిపాలిటీల్లో సుమారు 4,130 మంది పారిశుద్ధ్య కార్మికులు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. వీరంతా ఏప్రిల్ 1 నుంచి పనులు చేయాలంటే కొత్తగా టెండర్లు పిలిచి కాంట్రాక్టును ఖరారు చేయాలి, లేనిపక్షంలో ప్రస్తుతం ఉన్న విధానానే్న కొనసాగించాల్సి ఉంది. అయితే జివిఎంసిలో నెలకొన్న పరిస్థితుల్లో మూడు యూనియన్లు వారి,వారి అనుకూల విధానాలనే అమలు చేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 279 ప్రకారం పారిశుద్ధ్య పనులను ప్రైవేటు సంస్థలకు టెండర్ విధానంలో అప్పగించాల్సి ఉంది. ఈ విధానాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జివిఎంసిలో గుర్తింపు యూనియన్‌గా వ్యవహరిస్తున్న విఎంసి స్ట్ఫా అండ్ వర్కర్స్ యూనియన్ గత నిబంధనల మేరకు ప్యాకేజీలను దక్కించుకోగా, ఇదే విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తోంది. గతంలో గుర్తింపు యూనియన్‌గా పని చేసిన ఎఐటియుసి మాత్రం పారిశుద్ధ్య పనులను మహిళా సంఘాలకు అప్పగించాలని కోరుతోంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రైవేటు సంస్థలకు పనులు అప్పగించాలంటే పెద్ద కసరత్తే చేయాల్సి ఉంది. ఇప్పటి వరకూ ప్రైవేటు టెండర్ల ప్రక్రియను జివిఎంసి చేపట్టలేదు. పనులను చేపట్టేందుకు మూడు సంస్థలు ముందుకు వచ్చినప్పటికీ జివిఎంసి ఎటూ నిర్ణయించుకోలేదు. ఒకవేళ నిర్ణయం తీసుకుని ప్రక్రియను చేపట్టి పూర్తి చేసేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మే 22లోగా పారిశుద్ధ్య పనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు అవకాశం ఉంది. ఈ రెండు నెలల కాలంలో పారిశుద్ధ్య పనులను ఏ విధంగా నిర్వహిస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇదిలా ఉండగా పారిశుద్ధ్య పనులకు సంబంధించి జివిఎంసిలో చోటుచేసుకున్న అనిశ్చిత స్థితికి అధికారుల అనాలోచిత నిర్ణయాలే కారణంగా యూనియన్లు ఆరోపిస్తున్నాయి. పారిశుద్ధ్య పనుల టెండర్ల కాలపరిమితి ముగుస్తున్నప్పటికీ ప్రక్రియ చేపట్టకుండా కాలయాపన చేయడం వెనుక అధికారుల స్వలాభం ఉందంటూ ఆరోపిస్తున్నారు. గడువు పూర్తయిన తర్వాత పారిశుద్ధ్య పనులు నిర్వహించే కార్మికులకు జీతాలు ఎవరు చెల్లిస్తారన్నది అనుమానంగా మారింది. ప్రస్తుతం ఉన్న విధానానే్న కొనసాగిస్తే న్యాయ పరంగా చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వంలో పలుకుబడి కలిగిన కొన్ని వర్గాలు జివిఎంసిలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ విషయంలో జోక్యం చేసుకుని, కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో కమిషనర్ ఏ విధమైన నిర్ణయాన్ని ప్రకటిస్తారోనని కార్మిక సంఘాలు ఎదురు చూస్తున్నాయి.
సంక్షేమ హాస్టళ్లకు నాసిరకం దినుసుల సరఫరా
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 30: జిల్లాలోని కొన్ని సంక్షేమ హాస్టళ్లకు నాసి రకం దినుసులు సరఫరా అవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు తీసిన నమూనాలు ఈ విషయాన్ని తెలియచేస్తున్నాయి. జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. వీటికి కందిపప్పు, పెసరపప్పు, నూనె వంటివి కాంట్రాక్టు ద్వారా కొనుగోలు చేస్తుంటారు. హాస్టళ్లకు సరఫరా చేసే వీటిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొన్ని చోట్ల నుంచి నమూనాలు సేకరిస్తారు. వాటిని ఇన్‌ఫార్మల్ శాంపిల్స్‌గా వ్యవహరిస్తారు. ఈ శాంపిల్స్‌ను నగరంలోని ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాలలో పరీక్షిస్తారు. ఈ శాంపిల్స్‌పై క్రిమినల్ చర్యలు తీసుకునే వీలు లేనందున, వాటిపై తదుపరి చర్యకు సంబంధిత అధికారులకు నివేదిస్తారు. 2015 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకూ 638 శాంపిల్స్‌ను ఇక్కడి ప్రయోగశాలలో పరీక్షించారు. ఇందులో 35 శాంపిల్స్ సురక్షితం కాదని, నాసికరం, తక్కువ నాణ్యత కలిగినట్లుగా నిర్ధారించారు. సేకరించిన నమూనాల్లో దాదాపు 18 శాతం వరకూ నాసిరకానికి చెందిన వాటిగా నిర్థారించారు. కందిపప్పు, పెసరపప్పువంటి వాటిలో పప్పు పుచ్చిపోయి ఉండటం, ఇతర పదార్ధాలు ఉండటం తమ పరీక్షల్లో వెల్లడైందని ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాల సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ సత్యప్రసాద్ తెలిపారు. నూనె చాలా కాలం నిలువ ఉండటం వల్ల మాగిపోయిన వాసన వంటిది వస్తున్నట్లు గుర్తించామని, అటువంటి నూనె వినియోగానికి పనికిరాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అక్కడక్కడా తీసే ఈ శాంపిల్స్‌లో కొన్ని సంక్షేమ హాస్టళ్లకు సరఫరా అవుతున్న సరకుల నాణ్యతపై అనుమానాలకు తావిస్తున్నది. అయితే ఈ విషయమై సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల వద్ద ప్రస్తావించగా, తమ వద్ద ఆహార శాంపిల్స్ సేకరించిన దాఖలాలు లేవని తెలిపారు.
జివిఎంసి హెల్త్ అసిస్టెంట్ సస్పెన్షన్
* తప్పుడు ధృవీకరణ జారీయే కారణం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 30: మహా విశాఖ నగరపాలక సంస్థ 37వ డివిజన్ ఇన్‌ఛార్జి హెల్త్ అసిస్టెంట్ బండి నవీన్‌ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక వ్యక్తికి సంబంధించి మరణ సమాచారాన్ని తప్పుగా నమోదు చేయడంపై కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జివిఎంసి పరిధి 37వ వార్డు కంచరపాలెం, అంబేద్కర్ నగర్‌లో నివాసం ఉంటున్న మన్నం ఆనందకుమార్ అనే వ్యక్తి గత ఏడాది జనవరి 19న గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఉరి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆనందకుమార్ మరణానికి సంబంధించి, జివిఎంసి రికార్డుల్లో గత ఏడాది జనవరి 19న విశాఖలోనే మరణించినట్టు రికార్డుల్లో నమోదు చేయడమే కాకుండా, ధృవీకరణ పత్రాన్ని కూడా జారీ చేశారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు కమిషనర్ దర్యాప్తు జరిపించి, మరణ నమోదులో నిబంధనలు ఉల్లంఘించిన ఇన్‌ఛార్జి హెల్త్ అసిస్టెంట్ నవీన్‌ను సస్పెండ్ చేశారు. తప్పుడు సమాచారం అందించిన మన్నం లక్ష్మణకుమార్‌కు నోటీసులు జారీ చేయాలని కమిషనర్ ఆదేశించారు.
వివాదాస్పదంగా ప్రేమసమాజం శంకుస్థాపన
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 30: సేవా సంస్థ ప్రేమసమాజం భూముల విషయంలో లీజుదారుకు, ప్రేమ సమాజానికి మధ్య, ప్రైవేటు రిసార్ట్స్‌కి మధ్య వివాదం చోటుచేసుకుంది. రుషికొండ గ్రామంలో సుమారు 50 ఎకరాల భూములను సిపి రావు అనే దాత 1950లో ప్రేమసమాజం సంస్థకు దానం చేశారు. దీనిలో 33 ఎకరాల భూమిని సాయిప్రియ రిసార్ట్స్‌కు 2003లో 33 సంవత్సరాల కాలానికి లీజుకిచ్చారు. లీజుకిచ్చిన స్థలం మినహా మిగిలిన భూమిలో వృద్ధాశ్రమం, జూనియర్ కళాశాల, గోశాల నిర్మించాలని ప్రేమసమాజం పాలకవర్గం నిర్ణయించింది. ఈ మేరకు ప్రేమ సమాజం అధ్యక్షుడు కె రామబ్రహ్మం, ఉపాధ్యక్షుడు శివాజీ, మరికొంతమంది రుషికొండలోని సంస్థ భూముల వద్దకు వెళ్లారు. ప్రేమసమాజం శంకుస్థాపన చేసేందుకు నిర్ణయించిన స్థలం సాయిప్రియ రిసార్ట్స్ ఆధీనంలో ఉన్నట్టు గుర్తించారు. ప్రేమసమాజం పాలకవర్గంతో పాటు వృద్ధులు, బాలలు ఈప్రాంతానికి చేరుకోగా, రిసార్ట్స్ ప్రతినిధులు అభ్యంతరం చెప్పారు. గతంలో ప్రేమ సమాజం తరపున లీజుకిచ్చిన స్థలం మినహా తాము ఆక్రమణలకు పాల్పడలేదని వివరించారు. అయితే రిసార్ట్స్ ఆధీనంలోని స్థలం లీజుకిచ్చిన భూముల్లో లేవని, తాము శంకుస్థాపన చేసేందుకు అనుమతించాలని పాలకవర్గం డిమాండ్ చేసింది. ఇప్పటికే పర్యాటకాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వంతో తాము కొన్ని ఎంఓయులు చేసుకున్నామని యాజమాన్యం వివరణ ఇచ్చింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నిర్వహించి, లీజుకిచ్చిన భూమి మినహా మిగిలిన భూముల్లో ప్రేమసమాజం కార్యకలాపాలకు వినియోగించుకోవచ్చని సూచించారు. అయితే తొలుత తాము శంకుస్థాపన చేసుకుంటామని ప్రేమ సమాజం ప్రతినిధులు పట్టుబట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొద్దిపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. భూములను సర్వే చేయించిన తర్వాతే శంకుస్థాపన చేయాలని నిర్ణయించి వెనుదిరిగారు.
ఎయుకి ఐఎస్‌ఓ గుర్తింపు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 30: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఐఎస్‌ఓ గుర్తింపు లభించింది. ఎయు ఐక్యూఎసి కోఆర్డినేటర్ జిఎంజె రాజు ఐఎస్‌ఒ గుర్తింపు పత్రాన్ని బుధవారం ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్ ఇఎ నారాయణకు అందజేశారు. టియువి-ఎస్‌యుడి సౌత్ ఆసియా లిమిటెడ్ (ముంబయి) నుంచి అధికారిక ఉత్తర్వులు వచ్చాయని ఇన్‌ఛార్జి విసి నారాయణ తెలిపారు. ఐఎస్‌ఒ 9001:2008 సర్ట్ఫికేట్‌ను ఆంధ్ర విశ్వవిద్యాలయానికి దక్కిందన్నారు. 2018 సెప్టెంబర్ వరకు ఈ సర్ట్ఫికేట్ అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు. ఇటీవల ఐఎస్‌ఒ నిపుణుల బృందం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన తరువాత ఈ గుర్తింపు లభించిందని వివరించారు. రానున్న కాలంలో నాణ్యతా ప్రమాణాలను మరింతంగా పెంపొందించుకొని ముందుకెళ్తామన్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సిలబస్, కరికులం రూపకల్పన, యూజి కోర్సులకు అర్హత, పిజి, పరిశోధనలు, ప్రవేశాల ప్రక్రియ నియమావళి, పరీక్షలు, మూల్యాంకనం ఫలితాల విడుదల, స్నాతకోత్తర పట్టాలు అందించడం, వౌలిక సదుపాయాల కల్పన, కన్సల్టెన్సీ, అనుబంధ కళాశాలలు, పరిశీలన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఐఎస్‌ఒ గుర్తింపును అందజేసిందన్నారు. యూజీసి సమన్వయకర్త కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్ని రంగాల్లో మెరుగైన పనితీరు కనబరచడం వల్లనే ఈ గుర్తింపు లభించిందన్నారు. ఇందుకు సహకరించిన విభాగాధిపతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తాగునీటి సరఫరాకు ఇబ్బందులు రానీయొద్దు
* కమిషనర్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 30: వేసవి దృష్ట్యా నగరంలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కమార్ స్పష్టం చేశారు. మంచినీటి సరఫరా విభాగం ఉన్నతాధికారి సహా క్షేత్ర సిబ్బందితో కమిషనర్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచినీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా తక్షణమే అధికారులు స్పందించాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు సరఫరా చేసే నీటి నాణ్యతను పరిశీలించిన తర్వాతే సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. నీటి పైపుల లీకేజీలు, ఇతర మరమ్మతులకు తక్షణ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మంచినీటి సరఫరాకు సంబంధించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, విజ్ఞప్తుల విషయంలో ఎటువంటి అలక్ష్యాన్ని సహించేది లేదని కమిషనర్ అధికారులను హెచ్చరించారు. తప్పుచేసినట్టు రుజువైతే కఠిన చర్యలు తప్పవన్నారు. సమావేశంలో మంచినీటి సరఫరా విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆనందరావు, ఇఇలు పల్లంరాజు, శాసంన్‌రాజు , డిఇలు, ఎఇలు పాల్గొన్నారు.