విశాఖపట్నం

లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 12: లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని జిల్లా జడ్జి వి జయసూర్య అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన 9వ జాతీయ లోక్‌అదాలత్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవల సాధికార సంస్థ ఆదేశాల మేరకు 18 అంశాలకు సంబంధించి కేసులను కక్షిదారులు పరిష్కరించుకోవచ్చన్నారు. సత్వర న్యాయం అనే నినాదంతోనే సుప్రీంకోర్టు జిల్లా న్యాయసేవా అధికార సంస్థను ఏర్పాటు చేసిందన్నారు. పంతాలకు, పట్టింపులకు పోకుండా రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. ఈ లోక్‌అదాలత్‌లో సివిల్, క్రిమినల్, మోటారు వాహనాల చట్టం కేసులు, చెక్‌బౌన్స్ తదితర కేసులను పరిష్కరించుకునేందుకు వీలుందన్నారు. జాతీయ లోక్‌అదాలత్‌ను పురస్కరించుకుని జిల్లా కోర్టు ప్రాంగణంలో 19 బెంచ్‌లను ఏర్పాటు చేశామన్నారు. లోక్ అదాలత్‌లో పరిష్కరించుకునే అవకాశం ఉన్న దాదాపు నాలుగు వేల కేసులను గుర్తించామని, వీటిని పరిష్కరించుకుంటే కక్షిదారులకు మేలు చేకూరుతుందన్నారు. మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎన్ నరసింహరావు మాట్లాడుతూ ఇప్పటి వరకూ 8 లోక్ అదాలత్‌లు జరిగాయని, పలు కేసులను పరిష్కరించినట్టు తెలిపారు. 9వ జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించడం ద్వారా కక్షిదారులకు మేలు చేకూరే విధంగా కేసులను పరిష్కరించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల్లో సత్వర న్యాయం గురించి అవగాహన పెరిగిందని, లోక్ అదాలత్‌ల ద్వారా తమ కేసులను పరిష్కరించుకునేందుకు ముందుకు వస్తున్నారన్నారు. లోక్ అదాలత్‌ల ద్వారా కేసుల పరిష్కారంలో రాష్ట్రం ప్రధమ స్థానంలో ఉందన్నారు. ఈ సందర్భంగా మోటారు వాహనాల చట్టం ప్రకారం నమోదైన కేసుల్లో కక్షిదార్లకు రూ.14.5 లక్షల పరిహారాన్ని జిల్లా జడ్జి జయసూర్య చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి ఆర్‌వి నాగసుందరం, జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సురేష్‌కుమార్, బీమా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.