విశాఖపట్నం

ప్రభుత్వ స్కూళ్లలో సీటు కోసం పోటీ పడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, అక్టోబర్ 27 : ప్రభుత్వం విద్యా రంగంపై వేలాది కోట్లు ఖర్చు పెడుతుంది. అందుకు తగిన విధంగా ఫలితాలు కనిపించడంలేదు. ప్రభుత్వ స్కూళ్లలో సీట్ల కోసం పోటీ పడే పరిస్థితిని తీసుకురావాలని, దీనికి ముఖ్యంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులే బాధ్యత తీసుకోవాలంటూ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన ప్రాంతీయ విద్యా సదస్సును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో 6400 మంది విద్యార్థులకు పది పాయింట్లు పూర్తిస్థాయిలో వస్తే అందులో ప్రభుత్వ స్కూళ్లలో చదివిన విద్యార్థులు కేవలం 400 మంది ఉన్నారని అన్నారు. విద్యారంగంపై ఇప్పటికే రూ. 21,500 కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం ద్వారా మరిన్ని సంస్కరణలు జరుగుతాయని, ఇందులో ఉపాధ్యాయ వర్గాల భాగస్వామ్యం కావాలన్నారు. ప్రైవేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన, తెలివితేటలు గల ఉపాధ్యాయులు ఉన్నారరని, వారు తలచుకుంటే విద్యార్థులను అత్యుత్తమ పౌరులుగా, విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, అనిత, పీలా గోవింద సత్యనారాయణ, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం డి ఇ ఒలు ఎం.వి. కృష్ణారెడ్డి, బ్రహ్మానందరెడ్డి, అరుణ, మూడు జిల్లాల సర్వశిక్షా అభియాన్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.