విశాఖపట్నం

భాగస్వామ్య ఒప్పందాలకు తుది గడువు జనవరి 27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, అక్టోబర్ 27 : విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో చేసుకున్న ఒప్పందాల అమలుకు వచ్చే ఏడాది జనవరి 27 తుది గడువని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.పి. టక్కర్ అన్నారు. కంపెనీలు స్థాపించేందుకు ముందుకు వచ్చిన అన్ని ఒప్పందాలను ఈ గడువులోగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరిశ్రమలు, పర్యాటక, ఐటి రంగ అధికారులు, ప్రతినిధులతో ఆయన సమావేశమై ఒప్పందాల అమలు తీరు, ప్రగతిని సమీక్షిచారు. జిల్లా పరిశ్రమల శాఖ జి ఎం రామలింగరాజు, పర్యాటక శాఖ ఈడి శ్రీరాములునాయుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా భాగస్వామ్య సదస్సు ఒప్పందాల అమలు ప్రగతిని ముఖ్య కార్యదర్శికి వివరించారు. విశాఖ జిల్లాలో రూ. 46,343 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 26 ఒప్పందాలు జరిగాయని అన్నారు. వాటి ద్వారా 43,392 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ భవిష్యత్తులో కలగబోయే ఉద్యోగాలకు అనుగుణంగా స్థానిక యువతలో నైపుణ్యం పెంపొందించాలని అన్నార. విశాఖ జిల్లాలో పర్యాటకంగా విశాఖ జిల్లాలో 1025 కోట్ల పెట్టుబడులకు సంబంధించి చేసుకున్న 28 ఒప్పందాల అమలు వివిధ దశల్లో ఉన్నాయని తెలపడంతో వాటి సమగ్ర నివేదికను రూపొందించి సమర్పించాలని ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. ఇటి రంగ సమస్యలపై సమీక్షిస్తూ స్థానికంగానే వాటిని పరిష్కరించే అధికారాలను కలెక్టర్‌కే ఇస్తున్నామని అన్నారు. విశాఖలో పదివేల మంది ఐటి ఉద్యోగులకు గృహ వసతి కల్పించాల్సి ఉందని, అందుకు తగ్గట్టుగా విధి విధానాలను రూపొందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎపి ఐ ఐసి ఛైర్మన్ కృష్ణయ్య, వుడా విసి బాబూరావునాయుడు, కమిషనర్ హరినారాయణన్, పరిశ్రమలు, పర్యాటక, ఐటి కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.