విశాఖపట్నం

ఇండియా-న్యూజీలాండ్ మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), అక్టోబర్ 27 : భారత్-న్యూజీలాండ్ మ్యాచ్ నిర్విఘ్నంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహక కమిటీ ఛైర్మన్, పోర్టు చైర్మన్ ఎం.టి. కృష్ణబాబు అన్నారు. ఎసి ఎ-విడిసి ఎ స్టేడియంలో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాభై శాతం టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడైపోయాయని అన్నారు. రూ. 100, 3000, 5000 టిక్కెట్లు కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయని అన్నారు. మ్యాచ్‌కు ముందే వర్షం పడితే మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడకుండా పిచ్‌ను సిద్ధం చేసేందుకు తమ వద్ద సాంకేతిక సదుపాయాలు ఉన్నాయని అన్నారు. అయితే సిరీస్‌లో ఇరుజట్లు రెండేసి మ్యాచులు గెలిచి సమవుజ్జీగా నిలవడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారిందని అన్నారు.
భారీ బందోబస్తు
పోలీస్ కమిషనర్ యోగానంద్ మాట్లాడుతూ ఈ మ్యాచ్ కోసం 2000 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గేట్ల వద్ద టిక్కెట్లు తీసుకోవడం మినహా స్టేడియం మొత్తం పోలీసుల ఆధీనంలో ఉంటుందని అన్నారు. తినుబండారాలు, వాటర్ బాటిళ్లను ప్రేక్షకులతో పాటు స్టేడియం లోపలికి తీసుకెళ్లడానికి అనుమతించమని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మ్యాచ్ సమయంలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నామని అన్నారు. శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించాలని కమిటీ నిర్ణయించిందని అన్నారు.
విశాఖలో భారత్ సిరీస్ విజయం
ఎలాంటి అవాంతరాలు ఏర్పడినా మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ఆంధ్రా క్రికెట్ సంఘం కార్యదర్శి గోకరాజు గంగరాజు అన్నారు. అనుకున్న విధంగా మ్యాచ్ రద్దయినట్లయితే టిక్కెట్లు కొన్న వారికి వారం రోజుల్లోగా వారి సొమ్మును తిరిగి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కీలకమైన అయిదవ వనే్డ మ్యాచ్‌లో ఆతిథ్యమిస్తున్న విశాఖలో భారత్ ఘన విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడు సోమయాజులు మాట్లాడుతూ పిచ్‌పై వివాదాస్పదమైన వదంతుల ప్రచారం జరుగుతుందని, మ్యాచ్ స్థాయిని బట్టి పిచ్‌ను కేటాయించడం జరుగుతుందని అన్నారు. స్టేడియంలో ఎనిమిది పిచ్‌లు ఉన్నాయని, రంజీ మ్యాచ్‌లకు, టెస్టు మ్యాచ్‌లకు, జిల్లా, రాష్టస్థ్రాయి మ్యాచ్‌లకు వేర్వేరుగా పిచ్‌లను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. భారత్-న్యూజీలాండ్ మ్యాచ్‌లో కేటాయించిన పిచ్‌పై పరుగుల వరద పారుతుందని అన్నారు.