విశాఖపట్నం

దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ దీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 12: దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేలా ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని ఆర్టీసీ ఎన్‌ఎంయు హెచ్చరించింది. రాష్టవ్య్రాప్త ఆందోళనల్లో భాగంగా విశాఖలో పలుచోట్ల శనివారం కార్మికులు నిరాహారదీక్షలు చేపట్టారు. మద్దిలపాలెం డిపో ఆవరణలో చేపట్టిన దీక్షా శిబిరంలో డిపో కార్యదర్శి పిఎన్ మూర్తి, టివిపి రావు, ఇ.తోటయ్య, అవినాష్, ఎంవి రావు, సిహెచ్‌ఇ రావు, పిఎన్‌బి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ శిబిరాన్ని యూనియన్ రీజనల్ అధ్యక్షులు వి.అప్పారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలపై యాజమాన్యం స్పందించకపోతే ఈ నెల 18వ తేదీన జిల్లా కార్యాలయం వద్ద నిరాహారదీక్షా శిబిరం ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. ఆర్టీసిని నిర్వీర్యపరిచే అద్దె బస్సుల టెండర్లను ఆపాలని, కార్మికులపై పనిభారం, వేదింపు చర్యలు ఆపాలని డిమాండ్ చేశారు. అలాగే ఏకపక్షంగా ప్రవేశపెడుతున్న సింగిల్ క్రూ, టీమ్స్, వన్‌మేన్ సర్వీసులను ఆపి, ఆర్టీసీ రూట్లలో ప్రైవేటు వాహనాల అక్రమ రవాణాను అరికట్టాలని, స్థలాలను బివోటికు ఇచ్చే విధానాన్ని నిలుపుదల చేసి, సంస్థ ద్వారానే నిర్వహించాల్సిందిగా కోరారు. మిగిలిన కాంట్రాక్ట్ కార్మికులందర్ని రెగ్యులర్ చేయాలని, గ్యారేజీల నందు అవుట్ సోర్సింగ్ రద్దు చేసి ఖాళీలు భర్తీ చేయాలని, సరిపడా విడి భాగాలు సరఫరా చేయాలని, ఏపీనందు రాయలసీమలో ఆర్టీసీ కార్మికులకు, ఇంకొక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సదుపాయం కల్పించాలన్నారు. రిటైరు అయిన కార్మికులకు రావాల్సిన ఏరియర్స్, సెటిల్‌మెంట్‌లు వెంటనే ఇవ్వాలని, చనిపోయిన కార్మికుల పిల్లలకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని, 2012 నుండి పెండింగ్‌లో ఉన్న లీవు ఎన్‌కేస్‌మెటు, డిఏ ఏరియర్స్ చెల్లించాలని, మహిళా కార్మికుల విధుల్లో ఇబ్బందలు తొలగించి వారికి సూపర్ స్పెషాలిటీ వైద్య సదుపాయాన్ని కల్పించాల్సిందిగా యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.

విశాఖ రైల్వేస్టేషన్‌లో స్వచ్ఛ్భారత్
విశాఖపట్నం, డిసెంబర్ 12: స్వచ్ఛరైల్, స్వచ్ఛ్భారత్ పేరుతో విశాఖ రైల్వేస్టేషన్‌లో శనివారం పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టారు. సంత్ నిరంకారీ మిషన్ (విశాఖపట్నం) శాఖకు చెందిన సంత్‌నిరంకారీ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ్భారత్‌ను స్ఫూర్తిగా తీసుకుని వీటిని చేపట్టారు. రైల్వేస్టేషన్‌లో పలు ప్లాట్‌ఫారాలు, రైళ్ళను, పరిసర కార్యాలయాలను వీరంతా పరిశుభ్రపర్చారు. ప్రతినెల పలు రైల్వేస్టేషన్లలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడంలో భాగంగా ఇప్పటి వరకు 50 పెద్ద రైల్వేస్టేషన్లలో స్వచ్ఛ్భారత్‌ను నిర్వహించారు. రైల్వేస్టేషన్ మేనేజర్ (గెజిటెడ్) పండా, స్టేషన్ సూపరింటెండెంట్ పెంటకో బలరామ్‌స్వామి ఇతర సిబ్బంది స్వచ్ఛ్భారత్‌లో పాల్గొని చెత్తా,చెదారాన్ని తొలగించారు. భారతీయరైల్వే పరిధిలో అనేకచోట్ల రైల్వేస్టేషన్లలో స్వచ్ఛ్భారత్ నిర్వహించడంతోపాటు రక్తదానం, రక్తసేకరణ వంటి శిబిరాలు విస్తృతంగా నిర్వహిస్తూ స్వచ్చంధంగా ప్రతీ ఏడాది కోరిన వారికి రక్తాన్ని అందిస్తున్నుట్ట సేవాదళ్ సంచాలకులు రవి, రాజ్‌వీర్ గద్దిపలి రాములు పేర్కొన్నారు. సద్గురుబాబా హరదేవసింగ్‌జీ మహారాజ్ మానవ సేవే మాధవసేవ అని భావిస్తూ సేవాభావం, ఆయన అందించిన స్ఫూర్తి ప్రేరణతో ఇటువంటివి తరచూ నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.

ఈపిడిసిఎల్ ఆధ్వర్యంలో 14నుంచి ఇంధన పొదుపు వారోత్సవాలు
విశాఖపట్నం, డిసెంబర్ 12: ఈ నెల 14వ తేదీ నుంచి 21 వరకు ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) ఆధ్వర్యంలో ఇంధన పొదుపు వారోత్సవాలను నిర్వహిస్తున్నట్టు సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ (కమర్షియల్) బి.రమేష్‌ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంధన పొదుపుపై వినియోగదారుల్లో మరింత అవగాహన కల్పించడం, సామర్ధ్యాన్ని పెంపొందించడం, సౌరశక్తి గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశ్యంగా పేర్కొన్నారు.

కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు
అరకులోయ, డిసెంబర్ 12: స్థానిక సబ్బుల తయారీ కేంద్రంలో పనిచేస్తున్న గిరిజన కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గిరిజన సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్ ఎఎస్‌పిఎస్ రవిప్రకాశ్ హామీ ఇచ్చారు. స్థానిక గిరిజన ప్రాథమిక సహకార మార్కెటింగ్ సొసైటీ కార్యాలయం, సబ్బుల తయారీ కేంద్రాన్ని శుక్రవారం రాత్రి సందర్శించినప్పుడు కార్మికులు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. దీంతో కార్మికుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఎండి హామీ ఇచ్చారు. వివిధ రకాల సబ్బుల ఉత్పత్తి స్థాయిని పెంచాలని కార్మికులకు సూచించారు. లక్ష్యానికి మించి సబ్బుల ఉత్పత్తిని చేపడితే కేంద్రం నిర్వహణకు ప్రయోజకరంగా ఉంటుందన్నారు. సబ్బుల తయారీ కేంద్ర భవనాన్ని మరమ్మతులు చేయించాలని అధికారులకు ఆదేశించారు.