విశాఖపట్నం

పాత నోట్లకు మరో అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం,నవంబర్ 14: కేంద్రం రద్దు చేసిన రూ.500, వెయ్యి నోట్లతోనే విద్యుత్ బిల్లులు చెల్లించుకునే అవకాశాన్ని ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపీడీసిఎల్) యాజమాన్యం వినియోగదారులకు కల్పించింది. దీంతో బిల్లుల చెల్లింపునకు విశేష ఆదరణ లభిస్తుంది. గడిచిన మూడు రోజుల వ్యవధిలో ఏకంగా రూ.80 కోట్ల మేర చార్జీల రూపంలో సంస్థకు వచ్చాయి. అందువల్ల పాత నోట్లతోనే విద్యుత్ బిల్లుల చెల్లింపునకు ఈ నెల 24వ తేదీ వరకు మరో అవకాశాన్ని ఇస్తున్నట్టు సంస్థ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎమ్‌ఎమ్ నాయక్ తెలిపారు. ఈ అవకాశాన్ని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు సద్వినియోగపర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఏపీఈపీడీసిఎల్ ఏటిపి మిషన్లు, ఏపీ ఆన్‌లైన్ సెంటర్లు, అపనా సిఎస్‌సిలు, మీ-సేవా కేంద్రాలు, రాజీవ్ ఈపీడీసిఎఏల్ సెంటర్ల ద్వారా బిల్లులు చెల్లించుకోవచ్చన్నారు. అలాగే ఈపీడీసిఎల్ ఎలక్ట్రికల్ రెవెన్యూ ఆఫీసులు (ఈఆర్‌ఓ), కాల్‌సెంటర్ల ద్వారాను చెల్లింపుకునే సౌలభ్యం ఉందన్నారు.