విశాఖ

2018 నాటికి సంక్షేమ హాస్టళ్లు మూసివేత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యలమంచిలి రూరల్, నవంబర్ 18: 2018 నాటికి రాష్ట్రంలో గల సంక్షేమ హాస్టళ్లను మూసివేసేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తుందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎస్. నాయుడు అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. మోడల్ స్కూళ్ల పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో పట్టించుకోవడం లేదన్నారు. జెడ్పీ హైస్కూల్‌లో మంచినీరు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాలో 20మంది కంటే తక్కువ విద్యార్థులున్నారనే సాకుతో 30హాస్టళ్లను మూసివేశారన్నారు. రానున్న రోజుల్లో మొత్తం హాస్టళ్లను మూసివేసేందుకు ప్రభు త్వం సన్నాహకాలు చేస్తుందన్నారు. జిల్లాలో 30 సంక్షేమ హాస్టళ్లను మూసివేయగా మరో 30 హాస్టళ్లు ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్నాయన్నారు. ఆర్థిక సంవత్సరం మొదలై ఆరునెలలు గడుస్తున్నా కస్తురిబా పాఠశాలలో విద్యార్థులకు నోటుపుస్తకాలు అందలేదన్నారు. ఏజెన్సీలో గల ఆశ్రమ పాఠశాలల్లో ఈ ఏడాది ఆహార నాణ్యత లోపం కారణంగా 21మంది మృతిచెందారని, దీనిపై నానాహక్కుల కమిషన్‌కు ఎస్‌ఎఫ్‌ఐ ఫిర్యాదు చేస్తుందన్నారు. కళాశాల విద్యార్థుల మెస్ చార్జీలు 2500, హైస్కూల్ విద్యార్థుల మెస్‌చార్జీలు 1200 రూపాయలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు వై. అప్పలరాజు,డివిజన్ నాయకులు ఎం. రమణ, సిహెచ్ శివాజీ, సిహెచ్ బంగార్రాజులు పాల్గొన్నారు.
యలమంచిలిలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలు
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలు యలమంచిలిలో డిసెంబర్ 3, 4 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు వై. అప్పలరాజు తెలిపారు. జిల్లా మొత్తంమీద 300మంది ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు పాల్గొంటారని, విద్యారంగంలో వస్తున్న మార్పులు, విద్యాప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా సమావేశంలో ప్రసంగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, అధ్యక్ష, కార్యదర్శులతో సహా 300 మంది ప్రతినిధులు పాల్గొంటారన్నారు.