విశాఖ

ప్రాణం తీసిన వేధింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 5:ప్రైవేటు బ్యాంకు యాజమాన్యం వేధింపులు తాళలేక గుమస్తాగా పనిచేస్తున్న వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం వెలుగుచూసింది. విశాఖ నగరంలోని సీతంపేట, మధురానగర్, సాయిబాబా ఆలయం ఎదురుగా గల ది వైశాఖి మూచ్యువల్ కో ఆపరేటివ్ ఎయిడెడ్ సొసైటీలో చోరీకి గురైన సొత్తుకు సంబంధించి గుమస్తాగా పనిచేస్తున్న కెఎస్‌ఎస్‌డిఎస్ ప్రసాద్ (63)ను బాధ్యుని చేస్తూ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా, మనస్తాపం చెందిన ప్రసాద్ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సహకార శాఖలో పనిచేసి పదవీ విరమణ చేసిన ప్రసాద్ గత ఐదేళ్లుగా ప్రైవేటు బ్యాంకులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. గత నెల 24న బ్యాంకులో రూ.94వేలు నగదు, మూడు తులాల బంగారం అపహరణకు గురైంది. దీనికి సంబంధించి బ్యాంకు యాజమాన్యం ప్రసాద్‌ను అనుమానించి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ నిమిత్తం పోలీసులు పిలిపించడం, బ్యాంక్ యాజమాన్యం పదే పదే ఆయన ఇంటికి వెళ్లి ప్రశ్నించడంతో మనస్తాపం చెందిన ప్రసాద్ ఆదివారం విజయనగరం అలమండ వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి కుటుంబ సభ్యులకు ఆలస్యంగా తెలియడంతో నిర్ఘాంతపోయారు. మృతు డు ప్రసాద్ భార్య జానకిదేవి తన భర్త మరణానికి బ్యాంకు యజమాన్యం వేధింపులే కారణమని ఆరోపిస్తూ మృతదేహంతో మధురానగర్‌లోని బ్యాంక్ ముందు ఆందోళనకు దిగింది. సహకార శాఖలో 30 సంవత్సరాలు పనిచేసిన నిజాయితీ గల వ్యక్తిగా పేరుతెచ్చుకున్న తన భర్తపై ఈ ప్రైవేట్ బ్యాంకు యాజమాన్యం దొంగతనం కేసు మోపిందని ఆరోపించారు. సున్నిత మనస్కుడైన తన భర్త ఈ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. బ్యాంకులో చోరీ జరిగిన తర్వాత పోలీసుల విచారణ తీరును నిరసిస్తూ తాము నగర పోలీసు కమిషనర్‌కు గత నెల 30న ఫిర్యాదు చేశామన్నారు. అయినప్పటికీ బ్యాంకు యాజమాన్యం, పోలీసులు తన భర్తను వేధించడం మానుకోలేదన్నారు. పోలీసుల తీరు తన భర్త ప్రసాద్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిందన్నారు. రిటైరైనప్పటికీ కుటుంబ పోషణకోసం ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న తన భర్త సంపాదనపైనే కుటుంబం మొత్తం ఆధారపడి ఉందని, ఉన్న కుమారుడు మానసికరోగని ఇక తానేల జీవించేదని ఆమె బోరుమన్నారు. స్థానిక సంఘ సేవకులు గుమ్మడి కామినాయుడు మాట్లాడుతూ బ్యాంక్ యాజమాన్యం వేధింపుల వలన ఆత్మహత్య చేసుకున్న ప్రసాద్ కుటుంబానికి వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో కోపరేటివ్ బ్యాంక్‌లో 30ఏళ్లు పని చేసి మంచి వ్యక్తిగా పేరుతెచ్చుకున్న ప్రసాద్‌పై అన్యాయంగా అబండాలు వేసి ఆత్మహత్య చేసుకోనేలా ప్రేరేపించిన బ్యాంక్ యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని ఆయన కోరారు.
బ్యాంక్ ఎదుట కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన చేస్తుండడంతో సమాచారం అందుకున్న ద్వారకాజోన్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బ్యాంక్ మేనేజ్‌మంట్ నష్టపరిహారం చెల్లిస్తేగాని, మృతదేహాన్ని ఇక్కడ నుండి తీసుకుని వెళ్లేది లేదని ప్రసాద్ భార్య ఆందోళన చేపట్టారు. దీంతో ద్వారకాజోన్ సిఐ షణ్ముఖరావు, ఎస్సై భాస్కరరావు కలిసి మాట్లాడి, ఆమెకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని ఉరేగింపుగా జ్ఞానాపురంలోని శ్మశాన వాటికలో దహన సంస్కారం చేశారు.