విశాఖ

జనచైతన్య హామీల అమలుకు రూ. 20కోట్లు మంజూరుకు సిఎం చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, డిసెంబర్ 8: జనచైతన్య యాత్రల పర్యటనలో భాగంగా అనకాపల్లి అసెంబ్లీ పరిధిలోని వివిధ ప్రాంతాల ప్రజలకు తాను ఇచ్చిన హామీల అమలుకు సిఎం చంద్రబాబు 20కోట్ల ప్రత్యేక గ్రాంటును విడుదల చేసేందుకు చర్యలు తీసుకున్నారని స్థానిక శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు. స్థానిక జీవిఎంసి జోనల్ కార్యాలయంలో గురువారం వివిధ శాఖల అధికారులతోను, అనధికారులతోను పట్టణాభివృద్ధిపై ఆయన సమీక్ష నిర్వహించారు.
జనచైతన్య యాత్రల కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలపై 9.20కోట్ల వ్యయంతో కూడిన హామీలను ఇచ్చానని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో తాను జరిపిన జనచైతన్య యాత్ర పర్యటనలు, ఇందుకు ప్రజల నుండి లభించిన స్పందనను తాను సిఎంను స్వయంగా కలిసి విన్నవించానన్నారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించి 20కోట్ల ప్రత్యేక గ్రాంటును విడుదలకు చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారన్నారు. అనకాపల్లి పట్టణంలోని అన్ని సందుల్లోను ఎల్‌ఇడి లైటింగ్ సదుపాయం కల్పించేందుకు 400 లైట్లు వచ్చాయన్నారు. పట్టణంలోని ఇరుకుగా ఉండే నూకాంబిక ఆలయం రోడ్డు, చింతావారి వీధి రోడ్డు, నాయుళ్ల వీధి రోడ్డు తదితర మార్గాలను వచ్చే ఉగాదిలోగా విస్తరించే పనులు అమలులోకి వస్తాయన్నారు. కొత్తగా అనకాపల్లి జీవిఎంసి జోనల్ కార్యాలయ పరిధిలో 815మందికి పించన్లు మంజూరు కాగా వీరందరికీ ప్రత్యేకంగా అకౌంట్లు ఓపెన్ చేసి సంబంధిత ఖాతాల్లో ఈ మొత్తం జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పట్టణంలోని అన్ని ప్రధాన మార్గాల్లోను, డ్రైనేజీలు, సిసి రోడ్లు, తాగునీరు ఇతరత్రా వౌలిక వసతులను పూర్తిస్థాయిలో కల్పిస్తామన్నారు. నిధుల మంజూరులో విలీన గ్రామాలైన కొండకొప్పాక, రాజుపాలెం, వల్లూరు గ్రామాలకు సముచిత స్థానం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాపు కార్పొరేషన్ తమ సామాజిక వర్గ భవన నిర్మాణానికి రెండుకోట్ల ప్రత్యేక నిధులు విడుదల చేసిందన్నారు. అనకాపల్లి పట్టణంలో వివిధ పథకాల కింద మంజూరైన నిధులు, వాటి వినియోగంపై జోనల్ కమీషనర్ సుబానీతో ఆయన సమీక్షించి తగు ఆదేశాలు జారీచేసారు. ఈ సమీక్షలో ప్లానింగ్ ఆఫీసర్ రజని, పట్టణ దేశం అధ్యక్షులు బుద్ద నాగజగదీష్, జిల్లా దేశం కార్యదర్శి బొలిశెట్టి శ్రీనివాసరావు, పట్టణ తెలుగుయువత అధ్యక్షులు మళ్ల సురేంద్ర, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బిఎస్‌ఎంకె జోగినాయుడు తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.