విశాఖపట్నం

స్మార్ట్‌సిటీ సిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 8: ఒకవైపు నోట్ల బాధలతో అతలాకుతలం అవుతుంటే మరోపక్క స్మార్ట్‌సిటీ సిక్ అయింది. నగరవాసులకు ఈ ఏడాది చివరిలో కూడా పీత కష్టాలే. ఏ విధంగా తెల్లారుతుందోనన్న ఆందోళనే. రెండు మాసాలుగా సగటు జీవి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సామాన్య, మధ్య తరగతి వర్గాల బాధలు వర్ణనాతీతం. నోట్ల పుణ్యమా అని నెల రోజులుగా చేతిలో ఒక్క పైసా ఆడటం లేదు. దీనికి రోగాలు తోడవుతున్నాయి. వైద్యులు చూస్తే వాతావరణంలో మార్పులు అంటూ సరిపెడుతున్నారు. ఇదే నగరవాసుల పాలిట శాపమవుతుంది. జ్వరం, జలుబు, దగ్గు వంటి వాటితో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, చిన్నారులకు వీటి బాధ ఎక్కువైంది. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న జలుబు, జ్వరపీడితులతో ప్రైవేటు నర్సింగ్‌హోల్‌లు, క్లినిక్‌లు నిండిపోతున్నాయి. రెండు మాసాలుగా ఇదే పరిస్థితి. నీళ్ళు వడకాచి తాగినా, మందులు వేసుకుంటున్నా, గొంతు నొప్పితోపాటు ఇవి సామాన్యులను వేధిస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో తెలియని పరిస్థితి. ప్రతి ఇంటిలో కనీసం ఇద్దరు వీటితో బాధపడుతున్నారు. ఇన్‌ఫెక్షన్, జ్వరం తగ్గేందుకు వైద్యులు ఇస్తున్న మందులు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తున్నాయి. దీనివల్ల అనేకసార్లు జలుబు,జ్వరాలు వస్తున్న పరిస్థితులు నగరవాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు. సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు తీసుకుంటున్న చర్యలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. స్వచ్ఛ్భారత్, పరిశుభ్రత అంటూ ప్రచారాలే తప్ప కార్యరూపం దాల్చడంలేదు. నగరంలో మురికివాడలు, నగర శివారు గ్రామాల్లో పారిశుద్ద్యం అద్ధ్వాన్నంగా మారింది. చెత్త కుప్పలుగా పేరుకుపోవడం, కనీసం పనిముట్టు లేక, వీటి కొరతతో చేసేదిలేక పారిశుద్ద్య సిబ్బంది చేతులెత్తెస్తుండగా, మరోపక్క వీధుల్లో దోమలు, పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. వీటితో ఏర్పడిన అపారిశుద్ద్యం తీవ్ర అనారోగ్య పరిస్థితులకు దారితీస్తోంది. కాలువల్లో మురికి, ఇళ్ళవద్ద ఉండే దట్టమైన పొదలు, పశువుల కొట్టాల వద్ద దుర్వాసన వంటివి స్థానికులకు రోగాలబారిన పడేస్తున్నాయి. పిఎంపాలెం, మధురవాడ, గణేశ్‌నగర్, కొమ్మాది, కారుషెడ్ ఏరియా, హెచ్‌బి కాలనీ, బర్మాక్యాంపు, కంచరపాలెంమెట్టు, రాంజీఎస్టేట్, కైలాసపురం, తాటిచెట్లపాలెం, రైల్వేన్యూకాలనీ, మర్రిపాలెం, అల్లిపురం మార్కెట్ ఏరియా, భూపేషనగర్, వన్‌టౌను ఏరియాలు, మరికొన్ని మురికివాడల్లో పారిశుద్ధ్యం అద్ధ్వాన్నంగా ఉన్నందున పలు రోగాలు వ్యాప్తిచెందుతున్నాయంటూ మహిళలు, జ్వరపీడితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దోమల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా వీరు కోరుతున్నారు.