విశాఖపట్నం

వైద్య ఆరోగ్యశాఖలో అనధికార చెల్లింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, డిసెంబర్ 8: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో చిత్రమైన పద్ధతులు నడుస్తున్నాయి. వాస్తవంగా రాష్టవ్య్రాప్తంగా సంచార వైద్యసేవా పథకంలో పని చేస్తున్న సిబ్బందికి ఒక ప్రైవేటు సంస్థ ఏజెన్సీ నుంచి జీతాలు అందజేస్తుంటారు. 104 ఉద్యోగులను సంచార వైద్యసేవా పథకంలోకి తీసుకునే విధానంలో కొంతమందికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంతో జిల్లావైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోనే పలువురు ఉద్యోగులు సాధారణ బడ్జెట్ నుంచి జీతాలు చెల్లిస్తున్నారు. వాస్తవానికి ప్రైవేటు ఏజెన్సీ చెల్లిస్తున్న జీతాలనే ఆరోగ్యశాఖ ఉద్యోగులకు కూడా చెల్లించాల్సి ఉన్నప్పటికీ జిల్లావైద్యఆరోగ్యశాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి వారి ఆధ్వర్యంలో పని చేస్తున్న సిబ్బందికి ఔట్‌సోర్సింగ్ విధానం ద్వారా చెల్లించే జీతాలు మాదిరిగా చెల్లించడంతో అసలు సమస్య వచ్చిపడింది. విశాఖలో చెల్లిస్తున్న మాదిరిగానే అన్ని జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలంటూ మిగిలిన జిల్లాలు సైతం ఆయా జిల్లాల ఆరోగ్యశాఖాధికారులను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. వాస్తవానికి జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 11 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు, 12 మంది ఫార్మసిస్టులు, ఒక సహాయకులకు ఆరోగ్యశాఖే జీతాలు చెల్లిస్తుంది. మొత్తం 115 మందికి ప్రైవేటు సంస్థ జీతాలు అందజేస్తుంది. పెండింగ్ బిల్లుల కారణంగా సక్రమంగా జీతాలు అందజేయలేకపోతున్న ప్రైవేట సంస్థ కంటే ఆరోగ్యశాఖ అధికారులు ఒక అడుగు ముందుకేసి అదనపు జీతాలు చెల్లించడం సంబంధిత వర్గాలను సైతం విస్మయపరుస్తుంది. డాటా ఎంట్రీ ఆపరేటర్లు 9,500కు గాను 15 వేలు, ఫార్మసిస్టుకు 11 వేలకుగాను 20 వేలకు పైగా గడచిన రెండు మాసాల జీతాలు చెల్లించడంతో రూ.30 లక్షల మేర అదనపు చెల్లింపులు అనధికారికంగా జరిగిపోయాయి. ఈవిషయంపై సాధారణంగా జాయింట్ కలెక్టర్-2, జిల్లా కలెక్టర్ సైతం దృష్టిసారించాల్సి ఉన్నప్పటికీ వారిక్కూడా బురిడి కొట్టించి జిల్లా వైద్యాశాఖాధికారులు ఫైల్‌ను నడిపించడంతో అందరికంటే ఎక్కువుగా జీతాలను ఆయాసిబ్బంది జమ చేసేశారు. ఈ విషయంపై ఇటీవల విజయవాడలో జరిగిన ఓ సమావేశంలో జిల్లా అధికారులను ఏ విధంగా చెల్లిస్తారంటూ ఉన్నతాధికారులు ప్రశ్నిండంతో అసలు గుట్ట రట్టయ్యింది. ఈ నేపధ్యంలో గత రెండు మాసాల మాదిరిగా చెల్లించే జీతాల ప్రకారం వీటిని అందివ్వాలని, లేకుంటే ఆందోళన బాట చేపడామని ఆయా ఉద్యోగులంతా హెచ్చరిస్తున్నారు. అసలు విషయం బయటకు రావడంతో అనధికారికంగా చెల్లించాల్సిన జీతాలను వెనక్కి రాబట్టేందుకు ఆరోగ్య శాఖ అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈవిషయంపై వైద్యఆరోగ్యశాఖ కమిషనర్ డాక్టర్ శామ్యూల్ ఆనంద్‌ను ఆంధ్రభూమి ఫోన్‌లైన్‌లో వివరణ కోరగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఆయా సిబ్బందిపై చర్యలు తప్పవని జీతాలు చెల్లింపు విషయంపై పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.