విశాఖపట్నం

నెలరోజులైనా తీరని కష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 8: పెద్ద నోట్లు రద్దు చేసి నెల రోజులు పూర్తయ్యింది. అయినా ఇంకా జనం కష్టాలు తీరనేలేదు. పైగా నోట్ల సమస్యలు మరింతగా పెరుగుతున్నాయి. ఒకరోజు, రెండు రోజులు కాదు. ఏకంగా నెలల తరబడి పడుతున్న ఇటువంటి సమస్యలు తలుచుకుంటునే భయమేస్తుందంటూ వృద్ధులు గగ్గోలు చేస్తున్నారు. ఎలా తెల్లారుతుందనే ఆందోళన వీరికి పట్టుకుంది. ఫించన్ల సమస్య మళ్ళీ మొదటికే వచ్చింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పిదంతో వృద్ధులు, వితంతువులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. వైద్యుని ధృవపత్రం నుంచి స్థానిక ప్రజాప్రతినిధి సిఫారసు, నివాసిత ధృవపత్రం, ఆధార్‌కార్డు, తెలుపురంగు రేషన్‌కార్డు వంటివి అన్నింటి కోసం వృద్ధులు రోజుల తరబడి కార్యాలయాలచుట్టూ తిరగాల్సి వచ్చేది. చివరకు నెలల తరబడి తిరిగితే తప్ప చేతికి అర్హత పొందడమనేది సాధ్యపడలేదు. దీని తరువాత ఫించన్ మంజూరైనా చేతికందేసరికి మరికొన్నాళ్ళు పడుతుంది. ఈ విధంగా అన్ని కష్టాలుదాటుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వృద్ధులకు వేలి ముద్రలు అరిగాయంటూ పించన్ రావడంలేదనే సమాచారం మరింతగా ఆందోళన కలిగించేది. ఇటువంటవన్నీ అధిగమించని వీరు ఎట్టకేలకు పించన్ తీసుకుంటున్నారనుకుంటూ ఈ లోపు కేంద్రం నోట్ల బాంబు పేల్చింది. ఈసారి కేంద్రం వంతు అయ్యింది. దీంతో కాటికి కాళ్ళు చాసే వృద్ధులంతా ఇపుడు చేతికర్ర పట్టుకుని బ్యాంకుల వద్ద నిరీక్షించాల్సి వస్తుంది. నీరసించి, బాబూ కరుణించండి అంటూ ప్రాధేయపడినా ఫలితం లేకపోతోంది. ఏ ఒక్కరూ వీరికి సమాధానం చెప్పె వారు లేకుండాపోతుంది. మరోవైపు ఉద్యోగులు తమ జీతాల కోసం సెల్ఫ్ చెక్‌లతో బ్యాంకుల వద్ద రోజుల తరబడి క్యూ కడుతున్నారు. ఒకే ఒక్క రెండు వేల నోట్లు వస్తున్న కొత్త సమస్యలు వీరికి వేధిస్తున్నాయి. అదీ పూర్తి జీతం తీసుకునే వీలు లేకుండా పోతుంది. అలాగే చిల్లర వ్యాపారులు, కిరణా, పాల వ్యాపారాలు సైతం గణనీయంగా పడిపోయాయి. ఎంత చిన్న దుకాణం అయిన రోజుకీ వెయ్యి నుండి రెండు వేలు వరకు వచ్చేది. అటువంటిది గత నెల రోజులుగా నోట్ల రద్దు పుణ్యమా అంటూ రూ.500లోపే వ్యాపారాన్ని చేసుకోవాల్సి వస్తుందని అల్పాహార దుకాణాలు, కూరల వర్తకులు, కిరణా, మాంసం దుకాణ యజమానులు లబోదిబో మంటున్నారు. దుకాణాల్లో పనిచేసే సిబ్బంది కనీసం ఇద్దరు నుంచి నలుగురు ఉంటున్నారని, వీరందరికీ నెలాఖరిని జీతాలు, కరెంటు బిల్లులు, ఆస్తి పన్నులు అన్నీ కలిసి తడిచిమోపడవుతున్నాయని వ్యాపారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నోట్ల రద్దుతో కనీసస్థాయిలోనే ఆదాయం రాకుండా పోతుందని మరికొంతమంది అంటున్నారు. అలాగే డ్వాక్రా మహిళల సమస్యలు వర్ణనాతీతం. తమ పుస్తకాల్లో సొమ్మువేసారనే సమాచారంతో గత వారం రోజులుగా డ్వాక్రా సంఘాలు సభ్యులతో సహా బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా ఫలితం లేకపోతోంది. పుస్తకాల్లో ఒక్క రూపాయి పడలేదనే సమాచారం కొన్ని బ్యాంకుల నుంచి వస్తుండగా, మరికొన్నింటిలో ఉన్న సంఘ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో పడిన సొమ్మును తీసుకునే వీల్లేదంటూ అధికారులు చెబుతున్నారు. దీంతో ఏమీ చేయాలో తెలియక అయోమయంలో పడుతున్నారు. చివరకు విద్యార్ధులు సైతం బస్‌పాస్‌లు తీసుకునేందుకు నరకం చూడాల్సి వస్తుంది. ఇక్కడ చిల్లర సమస్యలు తలెత్తుతున్నాయి. ఈవిధంగా అన్ని వర్గాల ప్రజల నోట్ల కష్టాలను ఎదుర్కొంటున్నారు.