విశాఖ

నేడు వర్సిటీలో మెగా జాబ్‌మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 15: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో నేడు మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉయదం 9 గంటలకు ఏయూ స్నాతకోత్సవ మందిరంలో జరిగే కార్యక్రమంలో జాబ్‌మేళాను రాష్ట్ర మానవ వనరులశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభిస్తారు. ఇప్పటికే వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులు, యువత నేరుగా స్నాతకోత్సవ మందిరంలో ఉదయం 8.30 గంటలకు హాజరుకానున్నారు. జాబ్‌మేళాలో 59 సంస్థలు ఉపాధిని కల్పించడానికి హాజరవుతున్నాయన్నారు. సాఫ్ట్‌వేర్, యానిమేషన్, గ్రాఫిక్ డిజైనింగ్, బిపిఓ, మార్కెటింగ్, మైనింగ్ విభాగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. వెయ్యి నుంచి 1500 మంది వరకు ఎంపిక చేసే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు తాము ఎంపికలకు వెళ్ళాల్సిన సంస్థల సంఖ్యకనుగుణంగా రెజ్యూములు తీసుకురావాలని, సంస్థల వారీగా ఎంపికలకు ప్రత్యేక భవనాలు కేటాయించడం జరిగిందన్నారు. దీనికనుగుణంగా విద్యార్థులు ఆయా కేంద్రాల వద్ద ఎంపిక ప్రక్రియలో పాల్గొనాలన్నారు. ఉదయం 9 గంటలకు నిర్వహించే కార్యక్రమానికి వర్సిటీ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అధ్యక్షత వహిస్తారని, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, పోలీస్ కమిషనర్ టి.యోగానంద్, పోర్ట్‌చైర్మన్ ఎంటి కృష్ణబాబు, జీవిఎంసి కమిషనర్ ఎం.హరినారాయణన్, మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ సిఇఓ ప్రసాద్ లోకం, ఏపీఈపీడిసిఎల్ సిఎండి ఎంఎం నాయక్ తదితరులు పాల్గొంటారన్నారు.