విశాఖపట్నం

ముగిసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 30: కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రద్దయిన రూ. 500, రూ.1000 నోట్లు ఇక చెల్లని చిత్తు కాగితాల కిందే లెక్క. గత నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ నెల 30 వరకూ బ్యాంకుల్లో ఈ నోట్లను తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకునేందుకు కేంద్రం అనుమతించింది. తాజాగా కేంద్రం ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగియడంతో ఇక పెద్ద నోట్లను మార్చుకునేందుకు ఒక అవకాశం మాత్రమే మిగిలి ఉంది. రద్దయిన పెద్ద నోట్లుంటే వాటిని రిజర్వ్ బ్యాంకు అనుమతితోనే ఖాతాల్లో జమచేసుకునే వీలుంది. అది కూడా వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకూ మాత్రమే. ఆర్‌బిఐ అనుమతి పొందేందుకు ఖాతాదారు సరైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. గడువు ముగిసిన నేపథ్యంలో పెద్ద నోట్లు కలిగి ఉన్న వారిపై అపరాధ రుసుం విధింపు, జైలు శిక్ష వంటి అంశాలను ఆర్డినెన్స్ ద్వారా అమలు చేయాలన్న కేంద్ర నిర్ణయం సంచలనమైంది. రద్దయిన పెద్ద నోట్లు ఇప్పుడు చెల్లని చిత్తు కాగితాలుగా పరిగణించాల్సిందేనని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఆదాయపు పన్ను శాఖకు భయపడి పెద్ద నోట్లను దాచి ఉంచిన వారు ఇక వాటిని ఏమీ చేసుకోలేరని పేర్కొంటున్నారు. ఇక పెద్ద నోట్ల రద్దు అనంతరం కేంద్రం ఇచ్చిన 50 రోజుల గడువులో ఇప్పటి వరకూ నోట్లను మార్చుకున్న, ఖాతాల్లో డిపాజిట్ చేసిన మొత్తం సుమారు 1,670 కోట్లు ఉంటుందని అంచనా. జిల్లా వ్యాప్తంగా 47 బ్యాంకులకు సంబంధించి 738 శాఖల్లో ఈ మొత్తం డిపాజిట్లు జరిగాయి. నోట్ల రద్దు అనంతరం బ్యాంకుల్లో ఖాతాలున్నా లేకున్నా రూ.4000 వరకూ నోట్లు మార్చుకునే వెసులు బాటు కల్పించారు. వారం రోజుల అనంతరం ఈ అవకాశాన్ని కూడా కేంద్రం ఉపసంహరించుకుంది. పెద్ద నోట్లను ఖాతాల్లో జమచేసుకునే విషయంలో మాత్రం ఎటువంటి ఆంక్షలు విధించలేదు. అయితే బ్యాంకు ఖాతాల నుంచి నగదు తీసుకునే విషయంలో కేంద్రం పెట్టిన ఆంక్షలు ఇంకా కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం వారానికి రూ.24వేలు మాత్రమే ఖాతాల నుంచి తీసుకునే అవకాశం ఉంది. ఈ పరిమితుల సడలింపుపై ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదు. ఇక ఎటిఎం కౌంటర్లలో కూడా నగదు విత్‌డ్రాలపై ఆంక్షలు కొనసాగుతునే ఉన్నాయి. ఇదిలా ఉండగా, నగరంలో ఇప్పటికీ ఎటిఎంల్లో నగదు దొరక్క ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎటిఎంలలో రూ.2000 నోట్లు ఉంచడం వల్ల సమస్య తీవ్రతరమవుతోందన్నది ఖాతాదారుల ఆవేదన. కొత్తగా ముద్రించిన రూ.500 నోట్లు పూర్తి స్థాయిలో చెలామణిలోకి రాకపోవడంతో సామాన్యులకు ఇబ్బందులు తప్పట్లేదు. నోట్ల రద్దు అనంతరం డిసెంబర్ నెలలో సామాజిక పింఛన్ల పంపిణీకి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్ మొత్తాన్ని జమచేసినట్టు అధికారులు పేర్కొంటున్నప్పటికీ వాటిని తీసుకునే అవకాశం లేక అర్హులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే నెల 2 నుంచి జన్మభూమి కార్యక్రమం ప్రారంభం కావడంతో అప్పటికైనా పింఛన్ చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశిస్తోంది. జన్మభూమి సభలకు వెళ్లే అధికారులు పింఛన్ లబ్ధిదారులను సమాధాన పరిచే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని పేరు చెప్పేందుకు ఇష్టపడిని అధికారి ఒకరు వెల్లడించారు. ఇదే పరిస్థితులు కొనసాగితే ప్రజల మధ్య నిర్వహించే జన్మభూమి కార్యక్రమాలు రణరగ మయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.