విశాఖ

ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో వంద రామాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం, జనవరి 21: తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జిల్లాలోని 100 ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీతారామాలయాలు నిర్మించేందుకు టిటిడి నిధులు మంజూరు చేసిందని విశాఖ పూర్ణానంద సరస్వతి మహర్షి వెల్లడించారు. స్థానిక రామాలయం ఆవరణలో శనివారం మండల సమరసత సేవా ఫౌండేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన టిటిడి ప్రచారం రథం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. హిందూ మతంపై ప్రజలకు ఆసక్తికలిగిందని, దీంతో అన్యమత ప్రచారానికి స్వస్తిపలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. అయితే, క్షేత్రస్థాయిలో హిందూ మతం ప్రచారం ఊపందుకోవాలంటే నిరుపేద వర్గాలు జీవించే ఎస్సీ, ఎస్టీ కాలనీలను తిరుమల తిరుపతి దేవస్థానం ఎంపిక చేసిందన్నారు. అనకాపల్లి డివిజిన్ పరిధిలోగల 24 మండలాల్లో 16 మండలాలు, గిరిజన ప్రాంత మండలాలు 11 మండలాల్లో గల ఎస్సీ, ఎస్టీ నివాస కాలనీల్లో ఈ ఆలయాల నిర్మాణం ప్రారంభిస్తారన్నారు. ఒక్కో ఆలయ నిర్మాణానికి ఎనిమిది లక్షల రూపాయల చొప్పున ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. హిందూ దేవాలయాల్లో సంప్రోక్షణ వంటి కార్యక్రమాలను టిటిడి చేపడుతోందన్నారు. అంతకుముందు జిల్లా సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి సాయి రామ్ మాట్లాడుతూ అయిదు నెలల్లో బాలలకు గీతాపారాయణం నేర్పించటం వంటి దైవ కార్యక్రమాలకు టిటిడి సహాయం చేస్తోందన్నారు. హిందూ మత ప్రచారంలో టిటిడికి సహకరిస్తున్న సమరసత సేవా ఫౌండేషన్ కార్యక్రమాల పట్ల ఎంతో స్పందన కలుగుతోందన్నారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని టిటిడి నుంచి హాజరయిన ప్రత్యేక ప్రతినిధి రాంబాబు సారథ్యంలో పరిపూర్ణానంద సరస్వతి, జిల్లా సంఘం నేతలు శరగడం సత్యనారాయణ, గంగాధర్, ఆవుగడ్డ అప్పలనాయుడు, వెంకట రమణ, పెన్నం సూర్యనారాయణ, వైకుంఠరావు పట్నాయక్, సీత, సన్యాసి శెట్టి, కిల్లోగంగాధర్, సరళ గోవిందరావు, సీత, రాధాకుమారిలు పాల్గొన్నారు.

‘ఆరోగ్య సేవ’పై విస్తృత ప్రచారం అవసరం
ఎస్.రాయవరం, జనవరి 21: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ ఆరోగ్య సేవపై వైద్య సిబ్బంది విస్తృ ప్రచారాన్ని నిర్వహించాలని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్ ఆరోగ్య సేవపై చేపడుతున్న వైద్య సేవలు ప్రజలకు వివరించాలని, ఆరోగ్య కార్యకర్తలు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.
వచ్చే వేసవి నాటికి నీటి ఎద్దడి లేకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఎమ్మెల్యే సూచించారు. ప్రస్తుతం గ్రామాల్లో అవసరమైన మంచీనీటి సరఫరా పథకానికి కావాల్సిన నిధులపై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆమె సూచించారు. ప్రస్తుతం మండలంలో సొంత భవనం లేని పంచాయతీల వివరాలను తెలియజేయాలని, కావాల్సిన నిధులపై అంచనాలు తయారుచేయాలని పంచాయతీరాజ్ ఎఇకి సూచించారు. సాగునీరు, గృహనిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి వై. వినోద్‌రాజు, ఎంపిడివో డిడి స్వరూపారాణి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎరకయ్య, గణపతిరాజులు పాల్గొన్నారు. ఇదిలావుండగా ఎస్.రాయవరం గ్రామంలోని గౌరీపరమేశ్వరుల ఆలయంలో ఎమ్మెల్యే అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నమ్మకంపైనే వ్యవస్థ అభివృద్ధి
ఏ వ్యవస్థపైనైనా వినియోగదారులకు నమ్మకం కలిగినప్పుడే ఆ వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు. అడ్డురోడ్డులోని దన్యత మోటార్ సంస్థ పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంస్థ గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా రైతులకు రాయితీపై మోటార్ బైక్‌లను పంపిణీ చేస్తుందని, పదేళ్లుగా ఈ ప్రాంతంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా వినియోగదారుల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపిపి వినోద్‌రాజు, దన్యతా మోటార్స్ డిఎం రావు తదితరులు పాల్గొన్నారు.