విశాఖ

టీచర్ల నిర్లక్ష్యం.. బాలల జీవితాలపై ప్రభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జనవరి 26: మన్యంలోని ఉపాధ్యాయుల పనితీరుపై పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి పి.రవిసుభాష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల సంఘం రూపొందించిన క్యాలెండర్, డైరీలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘం నాయకులతో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల్లో చాలా మంది యువకులు ఉన్నప్పటికీ సక్రమంగా పాఠశాలలకు హాజరు కావడం లేదని అన్నారు.
విధి నిర్వహణలో ఉపాధ్యాయులు చూపుతున్న నిర్లక్ష్యం గిరిజన బాలల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మన్యంలో పనిచేసే ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా, అంకితభావంతో పనిచేయాలని ఆయన ఉద్భోదించారు. ఉపాధ్యాయులు విధిగా పాఠశాలలకు హాజరై గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన గురుత బాధ్యత ఉందని ఆయన అన్నారు. గిరిజన విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం సంఘం నాయకులు బాధ్యత తీసుకుని ఉపాధ్యాయులకు హితబోధ చేయాలని రవిసుభాష్ సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర శాఖ నాయకులు కిల్లు గంగన్నపడాల్, పలాసి క్రిష్ణారావు, రేగం నారాయణ, బి.శ్రీనివాసదొర, కె.రామారావు, జి.జనార్దనరావు, టి.లింగమూర్తి, కె.యు.ఎం. ఎస్.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన బోధన కోసమే
డిజిటల్ తరగతులు
చోడవరం, జనవరి 26: విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు వీలుగా దృశ్య, శ్రవణ(డిజిటల్ తరగతులను) ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు అన్నారు. స్థానిక జీ స్ట్రీట్ ప్రాథమిక పాఠశాలలో గురువారం డిజిటల్ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులకు దృశ్య, శ్రవణాల ద్వారా విద్యాబోధన చేయడం ద్వారా వారి మనస్సుకు హత్తుకుని ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. ప్రధానంగా వారిలో ఆయా పాఠ్యాంశాలను చూసి నేర్చుకోవడం వలన వారికి జ్ఞాపకం ఉంటాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమాలను మొక్కుబడిగా కాకుండా అంకితభావంతో డిజిటల్ తరగతులను నిర్వహించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. చోడవరం సర్పంచ్ దొమ్మెసి అప్పలనర్స గిరి, గూనూరు అచ్చిబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంవి సీతారామయ్య, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
కోడిపందాలు ఆడుతున్న ఏడుగురి అరెస్టు
దేవరాపల్లి, జనవరి 26: మండలంలోని పెదనందిపల్లి గ్రామంలో కోడిపందాలు ఆడుతున్న ఏడుగురుని గురువారం పట్టుకుని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ డి.ఈశ్వరరావు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నామన్నారు. ఈ దాడిలో కోడిపందాలు ఆడుతున్న నిందితులతో పాటు రూ.4370లు నగదును స్వాధీనం చేసుకుని చోడవరం కోర్టుకు పంపంచినట్టు తెలిపారు.