విశాఖ

సంక్షోభంలో ‘చక్కెర’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, ఫిబ్రవరి 4: దేశవ్యాప్తంగా చక్కెర పరిశ్రమలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని రాష్ట్ర సుగర్ కేన్ కమిషనర్ ఎన్. మురళీ అన్నారు. శనివారం సాయంత్రం ఆయన గోవాడ సుగర్స్‌ను సందర్శించి ఫ్యాక్టరీలో జరుగుతున్న క్రషింగ్ తీరుతెన్నులు, పంచదార నాణ్యతలతోపాటు 3.38 లక్షలతో నిర్మించిన గోదాములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అతిథిగృహంలో ఆయనను కలిసిన విలేఖర్లతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చెరకు పంట విస్తీర్ణం ఈ ఏడాది తగ్గడంతో రెండుకోట్ల 80లక్షల టన్నుల పంచదార బస్తాలు ఉత్పత్తి కావాల్సి ఉండగా రెండు లక్షల టన్నుల వరకు పంచదార దిగుబడి జరిగే అవకాశముందన్నారు. ఎక్కువ భాగం మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 50 శాతం పంచదార బస్తాల ఉత్పత్తి తగ్గిందన్నారు. ప్రధానంగా బెల్లం క్రషర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడం, ఫ్యాక్టరీల్లో రైతులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడంతోపాటు ఫ్యాక్టరీల ఆర్థిక పరిపుష్టి లేకపోవడం వలన పంచదార ఫ్యాక్టరీలకు గడ్డు కాలంగా ఉందన్నారు. రాబోయే ఏడాది అయినా రైతాంగం చెరకు పంట విస్తీర్ణాన్ని పెంపుచేయడంతోపాటు ఫ్యాక్టరీలు అనుబంధ పరిశ్రమల ఏర్పాటుపై శ్రద్ధ చూపించాలని ఆయన తెలిపారు. అలాగే గోవాడ సుగర్స్‌లో కూడా ఈ ఏడాది క్రషింగ్ లక్ష్యం కన్నా తక్కువగా క్రషింగ్ జరిగే అవకాశం ఉందని, రానున్న ఏడాదిలోనైనా లక్ష్యానికి మించి క్రషింగ్ జరిపేందుకు రైతులు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.్ఫ్యక్టరీల డిస్టిలరి యూనిట్ ఏర్పాటు ద్వారా లాభాలను ఆర్జించేందుకు అవకాశముందని ఆయన పాలకవర్గానికి సూచించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు, ఫ్యాక్టరీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు తదితర పాలకవర్గ సభ్యులు ఫ్యాక్టరీని మూడంచెల విధానం ద్వారా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ఆది, సోమవారాల్లో ఢిల్లీకి వెళ్లి అక్కడి మంత్రులను కలిసి ప్రభుత్వం ద్వారా వడ్డీలేని రుణ సహాయాన్ని అందించాలని కోరనున్నట్లు ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు తెలిపారు. అలాగే ఫ్యాక్టరీలో రోజువారీ క్రషింగ్ సామర్ధ్యం 4500 టన్నుల నుండి ఐదువేల టన్నులకు పెంపుచేసే అవకాశమున్న విభాగాల్లో యంత్రాల మార్పును దశలవారీగా చేపట్టడం జరుగుతుందన్నారు. మహాజనసభలో ఫ్యాక్టరీలో డిస్టలరీ యూనిట్ ఏర్పాటు కోసం తీర్మానం చేసి జిల్లాలోని ఫ్యాక్టరీల నుండి మొలాసిస్‌ను ఇక్కడకు తరలించి డిస్టిలరీ తయారీ చేపట్టేందుకు ఆయా ఫ్యాక్టరీల యాజమాన్యం, పాలకవర్గాలతో సమీక్ష జరపనున్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు కేన్ కమిషనర్ పాలకవర్గ సభ్యులతోను, కార్మికులతోను విడివిడిగా సమావేశాలు జరిపారు. ముందుగా రైతాంగానికి బకాయిలను చెల్లించాలన్నారు. అలాగే కార్మికులకు న్యాయమైన సమస్యల పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానన్నారు. అవసరమయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆయా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేతో కలిసి కృషిచేస్తామన్నారు. ఒకదశలో ఫ్యాక్టరీలో కొనుగోలు చేసిన విడిభాగాలను ఉపయోగించకుండా స్క్రాప్‌లో పారవేయడం ఫ్యాక్టరీ యాజమాన్య సిబ్బంది నిర్లక్ష్యానికి తార్కాణంగా ఆయన అభివర్ణించారు. ఇటువంటి చర్యలను తక్షణం రూపుమాపాలని ఎండీ విక్టర్ రాజుకు సూచించారు. ఈ సందర్భంగా పాలకవర్గసభ్యులు, కార్మికులు విడివిడిగా సుగర్ కేన్ కమిషనర్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కేన్ కమిషనర్ జివివి సత్యనారాయణ, ఇంజనీరింగ్ సలహాదారు రామభద్రరాజు, సిడివో మల్లిఖార్జున రెడ్డి, డిప్యూటీ సిడివో ప్రసాదరావు, ఫ్యాక్టరీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, పాలకవర్గ సభ్యులు, కార్మిక నాయకులు రామునాయుడు పాల్గొన్నారు.