విశాఖపట్నం

దండగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, ఫిబ్రవరి 4: విశాఖ నగరంలో నిర్వహించిన విశాఖ ఉత్సవాలపై పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తన దైన శైలిలో స్పందించారు. ఈ ప్రాంత కళాకారులకు ఉత్సవాల్లో ప్రాధాన్యత కల్పించలేదనే అసంతృప్తితో ఆలక బూనిన మంత్రి ఉత్సవాలకు గైర్హాజరైన సం గతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డులో పాడి గేదెల ప్రదర్శన, పాల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖ ఉత్సవాల నిర్వహణకు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన అధికార యంత్రాంగంపై మండిపడ్డారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి దోహదపడే పాడి గేదెల ప్రదర్శన, పాల పోటీలకు చందాలు వసూలు చేసి నిర్వహించాల్సిన దౌర్భాగ్య పరిస్థితిపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఉత్సవాల పేరుతో డ్యాన్స్‌లు వేసేందుకు ఐదు కోట్లు ఖర్చు పెట్టిన అధికారులు పాడిగేదెల ప్రదర్శనకు రెండు లక్షల రూపాయలు కేటాయించలేక పోయారా? అంటూ మండిపడ్డారు. పాల పోటీల ప్రాముఖ్యతను జిల్లా కలెక్టర్‌కు వివరించి నిధులు తేవడంలో పశు సంవర్ధక శాఖాధికారులు విఫలమయ్యారన్నారు. తన దృష్టికి తీసుకువచ్చినా కలెక్టర్‌తో మాట్లాడి నిధులు తెచ్చేవాడినన్నారు. విశాఖ నగరంలో ఉన్న డెయిరీ ఫామ్‌కు చెందిన 100 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని చూస్తే రైతులు తరిమికొడతారని ఆయన హెచ్చరించారు. పాడి పరశ్రమ అభివృద్ధికి ఉపయోగపడే ఈ స్థలాన్ని ఉడా ద్వారా సేకరించి షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్న విషయం వాస్తవమేనా అంటూ వేదికపై ఉన్న పశు సంవర్ధక శాఖ అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రంలో లభించే పశువుల గర్భధారణ స్పెర్మ్‌ను కోట్లాది రూపాయలు వెచ్చించి విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. ఇటువంటి కేంద్రాన్ని డెయిరీ ఫామ్ స్థలంలో ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఆదాయం సమకూరుతుందన్నారు. ఈ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు కాజేయాలని చూస్తున్నారని, వారి చేతుల్లోకి వెళ్ళకుండా చూడాల్సిన బాధ్యత రైతులపై ఉందని మంత్రి అయ్యన్న పేర్కొన్నారు.
* పశు సంపదను పరిరక్షించుకోవాలి
దేశీయ పశు సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. శనివారం ఇక్కడ మార్కెట్ యార్డులో జిల్లా స్థాయి పాల పోటీలు, లేగ దూడల ప్రదర్శనను ఆయన ప్రారంబించారు. పాడి, మత్స్యపరిశ్రమ ద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు ఆదాయం లభిస్తున్నా, వాటి అభివృద్ధికి తగిన శ్రద్ధ చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాధార ప్రాంతమైన జిల్లాలో రైతులకు పాల ఉత్పత్తి ద్వారా ప్రత్యామ్నాయ ఆదాయం లభిస్తోందన్నారు. పశువుల దాణా, గడ్డి పెంపకానికి ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు సమకూర్చుతున్నామన్నారు. జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసుకుని పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని పశు సంవర్ధక శాఖ అధికారులకు సూచించారు. అనంతరం ఉత్తమ పశువుల పెంపకం దారులను, పాడిలో అభివృద్ధి సాధించిన రైతులను, దేశీయ పశు వంగడాలను పరిరక్షిస్తున్న రైతులను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కేశవరావు, పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ జిల్లా అధ్యక్షుడు డి.రాఘవేంద్రరావు, ఆర్డీవో కె.సూర్యారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు, ఎం.పి.పి. సుకల రమణమ్మ, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అబ్బారావు తదితరులు పాల్గొన్నారు.