విశాఖపట్నం

శారదాపీఠంలో ఆధ్యాత్మిక శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 5 : చినముషిడివాడ శ్రీ శారదా పీఠంలో మూడు రోజులుగా జరుగుతున్న చతుర్వేద సంహిత శ్రీ వనదుర్గ అమ్మవారి మహాయాగం ఆదివారం ఘనంగా నిర్వహించారు. పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ స్వయంగా ప్రదోపకాల పీఠ పూజ నిర్వహించిన అనంతరం కార్యక్రమాలు ప్రారంభించారు. ముందుగా పీఠంలో వేంచేసిన శ్రీ వల్లీదేవసేన సహిత షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృతాభిషేకం చేశారు. అనంతరం చతుర్వేద సంహిత శ్రీ వనదుర్గ అమ్మవారి మహాయాగాన్ని స్వామి వారి స్వీయ పర్యవేక్షణలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన రుత్వికులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. ఏలినాటి శని ప్రభావం నుంచి ప్రజలను రక్షించడంతో పాటు వారి సుఖ సంతోషాల కోసం గ్రహాధిపతి శ్రీ వనదుర్గ అమ్మవారికి మహాయాగం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. పాలకులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ ప్రజలకు మేలు చేకూర్చాల, అందుకు భగవంతుని అనుగ్రహం తప్పనిసరని అన్నారు. పాలకులు కూడా దైవానుగ్రహం కోసం యజ్ఞ,యాగాదుల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
మూడవ రోజు పీఠంలో జరుగుతున్న వనదుర్గ అమ్మవారి యాగంలో ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పివి సింధు, ఆమె తల్లిదండ్రులు, బ్యాడ్ మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ దంపతులు, బ్యాడ్‌మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్, హైకోర్టు న్యాయమూర్తులు సీతారామమూర్తి, దుర్గా ప్రసాద్ దంపతులు, రాజమండ్రి ఎంపి మురళీమోహన్, ఎమ్మెల్యే గణబాబు తదితరులు వనదుర్గ యాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పివి సింధు మాట్లాడుతూ ఆధ్యాత్మికత అలరారుతున్న శారదాపీఠాన్ని సందర్శించడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. ముఖ్యంగా వనదుర్గ యాగంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు సీతారామమూర్తి, దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో భగవంతునికి ఇటువంటి యాగాలు నిర్వహించడం మంచిదన్నారు. కష్టాలు నియంత్రించి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేందుకు ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉపకరిస్తాయన్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు పీఠంలోని శ్రీ వల్లీదేవసేన సహిత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం సినీ నేపథ్య గాయకుడు పార్ధసారధి ఆధ్వర్యంలో మాళవిక, పాడుతా తీయగా విజేతలతో సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశారు.