విశాఖ

టైట్ ఫైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ఎమ్మెల్సీ ఎన్నికంటే ఓటు వేయడానికి పెద్దగా ఓటర్లు రారు. ఎమ్మెల్సీకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు కాబట్టి, ఓటర్లు ఈ ఎన్నికపై ఆసక్తి చూపరు. ఆమాటకొస్తే, ఓట్లను నమోదు చేసుకోడానికే ఇష్టపడరు. కానీ గురువారం జరిగిన పోలింగ్ సరళిని చూస్తే, ఇందుకు భిన్నంగా ఉంది. గతసారి ఇదే పట్ట్భద్రుల నియోజకవర్గానికి సుమారు లక్షా 70 వేల మంది ఓటర్లు ఉంటే, ఇందులో కేవలం 48 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. ఈసారి ఎన్నికకు ఆ ఓట్లన్నింటినీ రద్దు చేసి కొత్తగా ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రారంభిస్తే, సుమారు లక్షా 55 వేల 900 ఓట్లు నమోదైనాయి. ఇందులో 70 నుంచి 80 శాతం మంది ఓటర్లు ఓటు వేయాడానికి వచ్చారు. ఇది ఓటర్లలలో వచ్చిన చైతన్యమా? రాజకీయ పార్టీలు తమ ఉనికిని చాటుకోడానికి చేసిన ప్రయత్నాలా? ఏదైనా కావచ్చు. ఓటింగ్ శాతం మాత్రం భారీగా పెరిగిపోయింది. సాధారణ ఎన్నికల సమయంలో ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగితే, ఓటర్లు ఏదో ఒక పార్టీకి మద్దతు పలికినట్టుగా అర్థమవుతుంది. కానీ, ఈ ఎన్నికలో పెరిగిన ఓటింగ్ శాతాన్ని ఏవిధంగా అంచనా వేయాలి? ఇది ఇప్పుడు రాజకీయ విశే్లషకుల ముందున్న ప్రశ్న. ఈ ఓటింగ్ సరళిని చూసి సర్వేలు కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నాయి.
ఈ ఎన్నిక ప్రారంభంలో పిడిఎఫ్ అభ్యర్థి అజ శర్మ ప్రచారంలో దూసుకుపోవడం, వారికున్న ఓటు బ్యాంకు వగైరా అంశాలను పరిగణలోకి తీసుకుని, ఆయనదే పైచేయిగా కనిపించింది. నిన్న మొన్నటి వరకూ ఆయనపై అంచనాలు అలానే ఉన్నాయి. ఆ మాటకొస్తే, గురువారం పోలింగ్ సమయంలో కూడా శర్మకు అనుకూలంగా మాట్లాడిన వారు లేకపోలేదు. పోలింగ్ శాతం 40 నుంచి 50 శాతం వరకూ జరిగి ఉంటే, అజ శర్మపై అంచనాలు అలాగే ఉండేవి. అయితే, పోలింగ్ 70 నుంచి 75 శాతం వరకూ జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం అంచనాలకు మించి జరిగింది. తెలుగుదేశం, బిజెపి శ్రేణులు సర్వశక్తులు ఒడ్డి ఓటింగ్ చేయించారు. ప్రభుత్వ అధికారులు కూడా ఓటర్లపై ప్రభావం చూపిన దాఖలాలు ఉన్నాయి. ఈ ఎన్నికలో విజయం అటు టిడిపికి, ఇటు బిజెపికి అనివార్యం కావడంతో అన్ని ఉపాయాలను ప్రయోగించి, ఓటింగ్‌ను భారీగానే జరిపించారు. సాయంత్రానికి మాధవ్‌కు కూడా బాగానే ఉందట! అని వినిపించింది. ఉదయం 11 గంటలకు కేవలం 13 శాతం ఉన్న పోలింగ్ శాతం, సాయంత్రానికి ఇంత భారీగా ఎలా పెరిగిపోయిందన్నది చర్చనీయాంశమైంది. దీంతో శర్మ, మాధవ్ మధ్య టైట్ పోటీ జరిగిందని తెలుస్తోంది.
ప్రభావం చూపిన ఇండిపెండెంట్లు
ఇదిలా ఉండగా ఈ ఎన్నిక బరిలో ఉన్న ఇద్దరు ఇండిపెండెంట్లు మాధవ్, శర్మకు గట్టిపోటీనే ఇచ్చారు. విశాఖ నుంచి రమణమూర్తి, శ్రీకాకుళం నుంచి రవి దక్కించుకున్న ఓట్లు ఫలితాలపై ఏవిధంగా ప్రభావం చూపుతోందన్నదానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తమకు కచ్చితమైన ఓటు బ్యాంకు ఉంది కాబట్టి తమపై ప్రభావం ఉండకపోవచ్చని పిడిఎఫ్ వారి వాదన. వ్యూహాత్మంగా ఓటింగ్ చేయించుకున్నాం కాబట్టి, చీలిక ఓట్ల ప్రభావం తమపై ఉండదని టిడిపి ఎమ్మెల్యేలు అంటున్నారు. ఎవరేమనుకున్నా, చీలిక ఓట్లు ఒకరికి ప్రయోజనాన్ని, మరొకరికి చేటు తెస్తాయనడంలో సందేహం లేదు.
ఇక ప్రస్తుత ఓటర్లలో 40 శాతం మంది కొత్త ఓటర్లే. మొదటిసారిగా ఓటు హక్కు పొందినవారు. వీరిపై ఎవరెన్నివిధాలుగా ప్రభావం చూపినా, చివరకు ఓటు ఎవరికి వేశారన్నది ఇప్పుడు అంచనాలకు అందడం లేదు. వీరి ఓట్లే ఇప్పుడు కీలకం కాబోతున్నాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి యడ్ల ఆదిరాజు కూడా చాలా వరకూ ప్రభావాన్ని చూపిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయనకు వచ్చే ఓట్లు ఎవరిని నుంచి చీల్చుకుంటారో? ఏదియేమైనా పట్ట్భద్రుల ఓట్లన్నీ బ్యాలెట్ బాక్స్‌ల్లోకి చేరాయి. ఫలితాల కోసం 20వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే మరి.
చల్లబడిన నగరం

విశాఖపట్నం, మార్చి 9: విశాఖ నగరం చల్లబడింది. మధ్యాహ్నం వరకు ఎండ మండిపోతుండగా, సాయంత్రానికి ఒక్కసారిగా చల్లబడుతుంది. ప్రతి ఏడాది ఇటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటుండగా, వాతావరణంలో నెలకొన్న మార్పులతో ఈసారి కాస్త ముందుగానే చల్లబడింది. రెండు రోజులుగా ఆకాశం మేఘావృతం కావడం, గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి కారుమబ్బులు కమ్ముకుంటూ ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, ఈదురుగాలుల కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పగలు ఎండ ఉన్నా సాయంత్రానికి చల్లబడటంతో నగరవాసులు సేదదీరుతున్నారు. ఈ ఏడాది కాస్త ముందుగానే క్యుములో నింబస్ ఏర్పడిన కారణంగా సాయంత్రానికి ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. వాస్తవానికి చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, ఇది కాస్త కోస్తాంధ్రాకు మేలు చేస్తుందని ఈ కేంద్రం తెలియజేసింది. దీని ప్రభావంతోనే కోస్తాంధ్రాలో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని వివరించింది. శుక్రవారం సాయంత్రం కూడా అడపా,దడపా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, ఆ తరువాత మళ్ళీ వాతావరణం వేడిగానే ఉంటుందని ఈ కేంద్రం తెలిపింది. పగలు ఎండల తీవ్రత, సాయంత్రానికి వాతావరణం చల్లబడటం అనేది ఈసీజన్‌లో సాధారణమైనదిగా కేంద్రం తెలియజేసింది. కాగా గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో కొద్దిసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.