విశాఖ

మోదీ సంస్కరణలే విజయానికి కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, మార్చి 12: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అభివృద్ధే ధ్యేయంగా చేపట్టిన సంస్కరణలు, సంక్షేమ పథకాలు ఎన్నికల్లో విజయ పథాన నడిపించాయని భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకులు పివి చలపతిరావు, పివి మాధవ్‌లు అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజును కలిసి ఇటీవల జరిగిన పట్ట్భద్రుల శాసనమండలి పోలింగ్‌కు పార్టీ కార్యకర్తలు, నాయకులు తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అన్నివర్గాల ప్రజలకు బిజెపి చేరువవుతుందన్నారు. ప్రధానంగా మైనార్టీ, దళితవర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడమే కాకుండా నోట్ల రద్దు వంటి సంస్కరణలను కూడా చేపట్టడంతో బిజెపికి ప్రజలు పట్టం కట్టారన్నారు. అతి పెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో పట్టం కట్టారన్నారు. అలాగే మిగిలిన రాష్ట్రాల్లో కూడా పార్టీకి అధిక స్థానాలు దక్కాయన్నారు. నోట్ల రద్దు అపవాదు తొలగిపోయి పార్టీకి పేరుప్రతిష్ఠలు వచ్చాయన్నారు. ఈ సాహసోపేతమైన నిర్ణయాల వలన ఇటీవల జరిగిన పట్ట్భద్రుల శాసనమండలి ఎన్నికల్లో కూడా బిజెపి అభ్యర్థి మాధవ్ అధిక మెజార్టీతో గెలుపొందగలరని ధీమాను పివి చలపతిరావు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా భోగలింగేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి(నెహ్రూచౌక్), మార్చి 12: స్థానిక అగ్గిమర్రిచెట్టు కోటవీధి గవరపాలెంలో వేంచేసియున్న శ్రీ సర్వకామదాంబ సమేత శ్రీ భోగలింగేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం నుండి భోగలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.ఈ కల్యాణ మహోత్సవాల్లో భాగంగా సర్వకామదాంబ సమేత భోగలింగేశ్వర స్వామిని పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. తప్పెడగుళ్లు, చిటికెల భజనలు, నేలవేషాలు, భారీ మందుగుండు వినియోగం, మేళతాళాలతో స్వామివారి ఊరేగింపు వేడుకగా జరిపారు. అలాగే సర్వకామదాంబ అమ్మవారి మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సారే ఊరేగింపు నిర్వహించారు. దీంతో పట్టణ పురవీధుల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో భోగలింగేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ దొడ్డి జగదీశ్వరరావు, సర్వకామదాంబ దేవస్థాన చైర్మన్ కొణతాల అప్పలనాయుడు, కర్రి మల్లేశ్వరరావు, వానపల్లి కోటేశ్వరరావు, కె. రాము తదితరులు పాల్గొన్నారు.