విశాఖపట్నం

గ్రూపు-2 ప్రిలిమ్స్‌లో రిజర్వేషన్లు అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 19: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా వివిధ పోస్టుల భర్తీకి చేపడుతున్న ప్రిలిమ్స్ పరీక్షల్లో కటాఫ్ మార్కుల పేరుతో రిజర్వేషన్ల విధానాన్ని తెలుగుదేశం ప్రభుత్వం పాటించకపోవడంతో ఎస్సీ,ఎస్టీ,బిసి,మహిళ, వికలాంగులకు తీరని అన్యాయం జరుగుతోందని ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తంచేసాయి.సిఐటియు కార్యాలయంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. డివైఎఫ్‌ఐ విశాఖ జిల్లా కార్యదర్శి వివి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ఆయా తరగతులకు సంక్రమించిన హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యవక్త డాక్టర్ సోమశేఖర్, ప్రముఖ విద్యావేత్త, కృష్ణా కళాశాల చరిత్ర విభాగాధిపతి పాల్గొని ప్రసంగిస్తూ రాజ్యాంగం ప్రకారం ఆ తరగతులకు సంక్రమిచిన హక్కులను ప్రభుత్వ కాలరాస్తోందన్నారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల్లో ఇప్పటికే ఆయా వర్గాల ప్రయోజనాలను దెబ్బతీసిన ప్రభుత్వం ఇపుడు గ్రూపు-2లోను వారికి మెయిన్స్ అవకాశాలు లేకుండా చేస్తోందన్నారు. చాలా ఏళ్ళ తరువాత చేపట్టిన ఈ పోస్టుల భర్తీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయా తరగతుల నిరుద్యోగుల ఆశలను ఏపిపిఎస్‌సి, టిడిపి ప్రభుత్వం మొగ్గలోనే తుంచేస్తున్నాయన్నారు. ప్రభుత్వతీరును తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రజాసంఘాల తరపున ఖండించారు. ప్రిలిమ్స్‌లో జనరల్ కటాఫ్ పేరిట అవకాశాలను దెబ్బతీస్తున్న ప్రభుత్వంపై రాష్టవ్య్రాప్త ఉద్యమానికి సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వివి శ్రీనివాసరావు, ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర నాయకులు కె.అప్పలనాయుడు, ఐద్వా నగర కార్యదర్శి ఆర్‌ఎన్ మాధవి, కెవిపిఎస్ నాయకులు ఆర్‌పి రాజులు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎపిపిఎస్‌లో గ్రూపు-1కు మాత్రమే ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహిస్తుండగా, మిగతా అన్ని కేటగిరీల పోస్టులకు అబ్జెక్ట్ టైప్‌లో ఒకే పరీక్ష ద్వారా ఎంపికలు చేపట్టేవారు. నేడు చంద్రబాబు ప్రభుత్వం గ్రూపుతోపాటు ఇతర కేటగిరీల్లోను 25వేల దరఖాస్తులు దాటితే ప్రిలిమ్స్ నిర్వహించి 1:50 నిష్పత్తిలో జనరల్ కటాఫ్ మార్కులు నిర్ణయించి ఆ మార్కులు సాధించిన అభ్యర్థులకు మాత్రమే మెయిన్స్‌కు అర్హత కల్పించాలని నిర్ణయించింది. దీనివలన తమ కేటగిరీకి పోస్టులున్నా ప్రిలిమ్స్‌లో కటాఫ్ మార్కులు రాకపోతే ఆయా వర్గాల వారు మెయిన్స్‌కు అనర్హులు అవుతారన్నారు. దీనివల్ల ఇపుడు గ్రూపు-2 లో రిజర్వుడ్ పోస్టులున్నా ఎస్సీ,ఎస్టీ, బిసి, మహిళ, వికలాంగులకు అందకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ దుర్మార్గాన్ని ఖండిస్తున్నామన్నారు. అలాగే రాష్ట్రంలోని 982 గ్రూపు 2కేటరిరీ పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించిన ఎపిపిఎస్‌సి ఇటీవలే కీ విడుదల చేసిందన్నారు. ఈ ప్రిలిమ్స్‌లో జనరల్ కటాప్ మార్కులు నిర్ణయించి 1:5 నిష్పత్తిలో మెయిన్స్‌కు అర్హులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం మెయిన్స్‌కు 46 వేల నుంచి 50వేల మంది ఎంపికయ్యే అవకాశం ఉందన్నారు. ఈ 982 పోస్టుల్లో 3/4 వరకు ఎస్సీ,ఎస్టీ, బిసి,మహిళ, వికలాంగుల కోటా కిందకు వస్తాయన్నారు. కానీ ప్రభు త్వం రిజర్వేషన్ల ప్రకారం కాకుండా జనరల్ కటాఫ్‌తో మెయిన్స్‌కు ఎంపికలు చేస్తున్నందున ఆయా తరగతుల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ఎపిపిఎస్‌సికి పలు ప్రశ్నలు అడుగుతున్నామన్నారు. గ్రూపు-2 ప్రిలిమ్స్‌లో ఎస్సీ,ఎస్టీ,బీసి, మహిళ, వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని ఈ సమావేశంలో ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. లేనట్లయితే నిరుద్యోగులు పెద్దఎత్తున ఆందోళనకు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 20వ తేదీన విజయవాడలో జరుగు ఆందోళన కార్యక్రమంలో నిరుద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని సమావేశం విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ప్రతినిధులు అప్పలనాయుడు, ఐద్వా నగర కార్యదర్శి ఆర్‌ఎన్ మాధవి, కెవిపిఎస్ నాయకులు ఆర్‌పి రాజు, హరేంద్రదాస్, కృష్ణమూర్తి, యుఎస్‌ఎన్ రాజు, ఏయూ నాయకులు ఈశ్వరరావు, నాయుడు పాల్గొన్నారు.