విశాఖ

అనధికార ఉపాధ్యాయులను పరీక్షా కేంద్రాలకు రానిస్తే వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డుంబ్రిగుడ, మార్చి 23: పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు మినహా అనధికార ఉపాధ్యాయులను రానిస్తే వేటు తప్పదని పరీక్ష నిర్వహణ సిబ్బందికి గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కమల ఆదేశించారు. ప్రశాంత వాతావరణం నడుమ జరుగుతున్న పదో తరగతి పరీక్షల సెంటర్ల ఆవరణలో ఎటువంటి చిత్తుకాగితాలు లేకుండా చూడాలన్నారు. డుంబ్రిగుడ కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల బి.సెంటర్‌ను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు. అనంతరం పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో కుప్పలుతెప్పలుగా, అక్కడక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న పలు రకాల కాగితాలను చూసిన డి.డి. వాటిని ఏరవేసి పరిశుభ్రంగా ఉంచాలని పాఠశాల నిర్వాహకులకు ఆదేశించారు. పాడేరు డివిజన్ పరిధిలోని 128 పరీక్ష కేంద్రాలతో పాటు ఒక ప్రయివేట్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని, ఆయా సెంటర్లలో ఈ ఏడాది 5వేల 900 విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా 75 మంది హాజరుకావడం లేదని ఆమె తెలిపారు. అయితే ఆయా సెంటర్లలోని జి.మాడుగులలోనే మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలల్లోని పరీక్షలు ముగిసేంత వరకూ ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు భవిష్యత్‌లో జరగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆమె తెలిపారు. విద్యార్థిని విద్యార్థులు హాజరై పరీక్షలు రాసున్న సమయాల్లో ఎటువంటి ఇబ్బందులు కలుగనీయకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ఇదే తరహాలో అన్ని సెంటర్లలో జరుగుతున్న నిర్వాహకులకు కూడా సూచించినట్టు డి.డి. తెలిపారు. ఉపాధ్యాయులు పాఠశాలలను వీడి పరీక్షా సంటర్లకే పరిమితవుతున్నట్టు తెలిస్తే అటువంటి వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోక తప్పదని డి.డి. హెచ్చరించారు.
విద్యార్థుల మరణాలపై హెచ్.ఎం.లకు మెమోలు
మండలంలోని ఇటీవల డుంబ్రిగుడ బాలురు, జామిగుడ బాలికలు పాఠశాలల్లో ఇద్దరు విద్యార్థుల మృతి సంఘటనపై ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు చార్జి మెమోలను జారీ చేసినట్టు డి.డి. కమల తెలిపారు. విద్యార్థుల మృతిపై ఆయా పాఠశాలల నిర్వాహకులు నిర్లక్ష్యం వహించినట్టు కొనసాగుతున్న దర్యాప్తులో వాస్తవాలు రుజువైతే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం తధ్యమని డి.డి. అన్నారు. ఈమెతో పాటు ఎం.ఇ.ఒ. త్రినాథరావు పాల్గొన్నారు.