విశాఖ

షాపింగ్ కాంప్లెక్స్ నిర్వాహకులకు నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, మార్చి 24: స్థానిక ఐ.టి.డి.ఎ. వాణిజ్య సముదాయం (కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్) నిర్వాహకులకు నోటీసులు జారీ చేయనున్నట్టు పెదలబుడు మేజరు పంచాయతీ కార్యనిర్వహణ అధికారి అచ్యుతరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య సముదాయాలను నిర్వహిస్తున్న వారికి నోటీసులు జారీ చేయనున్నామన్నారు. పాడేరు ఐ.టి.డి.ఎ. పర్యవేక్షణలో నిర్వహింపబడుతున్న కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్‌లను కొంతమంది వ్యాపారులు అనధికారికంగా నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో పూర్తి వివరాలు తెలుసుకోవడంలో భాగంగా నోటీసులు ఇస్తున్నామన్నారు. స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్.ప్రేమాకరరావు సూచనల మేరకు కాంప్లెక్స్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి గిరిజన నిరుద్యోగులకు న్యాయం చేకూరుస్తామని ఆయన చెప్పారు. ప్రధానంగా షాపింగ్ కాంప్లెక్స్‌లకు అద్దెలు చెల్లించడం లేదని ఈ మేరకు నిర్వాహకులకు నోటీసులు జారీ చేయనున్నట్టు ఆయన చెప్పారు. పెదలబుడు పంచాయతీలో కోటి రూపాయలకు పైగా ఇంటి పన్నులు, లైసైన్స్ ఫీజులు వసూలు కావలసి ఉందని ఆయన అన్నారు. అయితే పన్నుల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇంతవరకు 30 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ఆయన తెలిపారు. ఇంకా వసూలు కావలసిన 70 లక్షల రూపాయలను త్వరలోనే వసూలు చేస్తామని ఆయన అన్నారు. అరకులోయ పట్టణంలో పర్యాటకుల సౌకర్యార్థం సులాబ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదించినట్టు ఆయన చెప్పారు. 13వ ఆర్థిక సంఘం నిధులతో సులాబ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పర్యాటక కేంద్రమైన అరకులోయలో సులాబ్ కాంప్లెక్స్ లేకపోవడం వలన సందర్శకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్టు అచ్చుతరావు చెప్పారు.

తెలియక చేసిన తప్పు.. ప్రాణాల మీదకు తెచ్చింది!

నర్సీపట్నం, మార్చి 24: తెలియక చేసిన తప్పు నలుగురు విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది. వీరిలో ఒక విద్యార్థి ప్రాణాపాయ స్థితిలో విశాఖ కె.జి.హెచ్.కు తరలించగా, మరో ముగ్గురు స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏటిగైరంపేట మండల ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. పాఠశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థులు బ్యాటరీతో పనిచేసే వీడియో గేమ్‌ప్లేయర్‌తో ఆడుకుంటూ ఫ్లేయర్‌లో ఉన్న రెండు బ్యాటరీల వైర్లు కలిపారు. అదే సమయంలో సాంకేతిక లోపంతో పెద్ద శబ్దంతో విద్యార్థుల చేతిలో పేలిపోయింది. దీంతో విద్యార్థులు పుల్లేరు స్వామి(9), మజ్జేటి గాంధీ(9), కాళ్ళ సతీష్(9), అప్పిలి రాజేష్(9)లు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో పుల్లేరు స్వామి కుడి చేతి మూడువేళ్ళు తెగి పడిపోగా ముఖం మొత్తం బొబ్బలెక్కి పోయింది. తీవ్ర గాయాలతో స్వామి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అప్పిలి రాజేష్ కుడిచేతి వేళ్ళు దెబ్బతినగా, గాంధీ, సతీష్‌లు స్వల్పంగా గాయపడ్డారు. వీరందరినీ పాఠశాల ఉపాధ్యాయుడు ప్రైవేట్ వాహనంలో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి డాక్టర్లు గాయపడిన విద్యార్థులకు అత్యవసర వైద్య సేవలందించారు. స్వామి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విశాఖ కె.జి.హెచ్.కు తరలించారు. స్వామి తల్లిదండ్రులు కూలీ పని నిమిత్తం గుంటూరులో ఉంటున్నారు. దీంతో తాత వద్దనే స్వామి ఉంటూ చదువుకుంటున్నాడు.
ఈ సందర్భంగా పాఠశాల హెచ్.ఎం. శివసత్యనారాయణ, ఉపాధ్యాయుడు దొరబాబులు మాట్లాడుతూ సెల్‌ఫోన్ పేలిందని అనుకున్నామని, అయితే వీడియో గేమ్ ఫ్లేయర్‌ను విద్యార్థులు ఏం చేసారో తెలియదు కాని పేలి ప్రమాదం సంభవించిందని తెలిపారు. గాయపడిన విద్యార్థులను వైకాపా నియోజకవర్గం సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్ ఏరియా ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు.