విశాఖపట్నం

401 మద్యం దుకాణాలకు 31న లాటరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 24: మద్యం దుకాణాల ఏర్పాటుకు సంబంధించి దరఖాస్తుదారుడు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకున్నప్పుడు జనరేట్ అయిన ఫారం ఎ3(బి), రిజిస్ట్రేషన్ సర్ట్ఫికెట్ ఫారం-ఆర్1, ఎంట్రీపాస్, ఫారం ఇ-1ను పొందాలని డిసి గోపాలకృష్ణ సూచించారు. దరఖాస్తు రుసుము 5000 రూపాయల (నాన్ రిఫండబుల్) ఒరిజినల్ చలానా డిసి కార్యాలయంలో అంద చేయాల్సి ఉంటుంది.
మండలంలోని మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేసుకునేందుకు 50,000 రూపాయలు, మున్సిపాలిటీ పరిధిలో దుకాణాన్ని ఏర్పాటు చేసుకునేందుకు 75,000 రూపాయలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో షాపు ఏర్పాటు చేసుకునేవారు లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. వీటితోపాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోల, ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్, రెండు సంవత్సరాల ఐటి, వ్యాట్ రిటర్న్స్ జిరాక్స్ కాపీలు, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ కోసం మూడు లక్షల రూపాయలను సంబంధిత ఎక్సైజ్ సూపరింటెండెంట్ పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవలసి ఉంటుంది. అలాగే షెడ్యూల్డ్ ఏరియాలోని మద్యం దుకాణాలకు దరఖాస్తు చేయాలనుకున్నవారు షెడ్యూల్డ్ ట్రైబ్ సర్ట్ఫికెట్, రెసిడెన్స్ సర్ట్ఫికెట్ అంద చేయాలని గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఐదు వేల లోపు జనాభా ఉన్న మండలంలోని మద్యం దుకాణ లైసెన్స్ ఫీజు సంవత్సరానికి 7,50,000 రూపాయలు, 5000 నుంచి 10 వేల జనాభా ఉన్న మండలంలోని మద్యం షాపు లైసెన్స్‌కు ఫీజు సంవత్సరానికి 8,50,000 రూపాయలు, 10 నుంచి 25 వేల జనాభా ఉన్న మండలం, నగర పంచాయితీలో దుకాణ లైసెన్స్ ఫీజు సంవత్సరానికి 9,25,000 రూపాయలు, 25 నుంచి 50 వేల జనాభా ఉన్న మండలం, నగర పంచాయితీలు, మున్సిపాలిటీల్లో మద్యం దుకాణ లైసెన్స్ ఫీజు సంవత్సరానికి 10 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 50 వేల నుంచి మూడు లక్షల జనా ఉన్న మండలం, నగర పంచాయితీలు, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్‌లలో మద్యం షాపు లైసెన్స్ ఫీజు సంవత్సరానికి 11,25,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఐదు లక్షలు ఆపై జనాభా ఉన్న ప్రాతాల్లో లైసెన్స్ ఫీజు సంవత్సరానికి 16.25.000 రూపాయలు చెల్లించాలని డిసి గోపాలకృష్ణ వివరించారు.
ఒక దరఖాస్తుదారుడు ఒక గజిట్‌కు ఒక దరఖాస్తు మాత్రమే చేసుకోవాలి. ఇదే దరఖాస్తుదారుడు ఇతర గజిట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకటి కంటే, ఎక్కువ గజిట్‌లకు దరఖాస్తులు చేసుకున్నప్పుడు మూడు లక్షల రూపాయల ఎర్నెస్ట్ డిపాజిట్ ఒరిజినల్ డిమాండ్ డ్రాఫ్ట్‌ను ఒక దరఖాస్తుకు పెట్టి, మిగిలిన వాటికి అదే డి.డి. జిరాక్స్ కాపీలను జతపరచవచ్చు. లాటరీ తీసే సమయంలో దరఖాస్తుదారుడు విధిగా అక్కడ ఉండాలని గోపాలకృష్ణ వివరించారు. దరఖాస్తుదారుడు అక్కడ లేకపోతే, ఆ వ్యక్తికి లాటరీలో షాపు వచ్చినా కేటాయించారు. అలగా ఆ వ్యక్తి చెల్లించిన మూడు లక్షల రూపాయల ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ కూడా ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. షాపు దక్కించుకున్న దరఖాస్తుదారుడు మండలం, మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో నిబంధనలకు లోబడి ఎక్కడైనా దుకాణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ లాటరీ 31వ తేదీన జిల్లా కలెక్టర్ సమక్షంలో విఐపి రోడ్డులోని కెపిఆర్ కనె్వన్షన్ సెంటర్‌లో నిర్వహించన్నట్టు ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ గోపాలకృష్ణ తెలియచేశారు.