విశాఖపట్నం

అసభ్యకర టివి సీరియల్స్‌ను నియంత్రించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 24: బుల్లితెరలో వస్తున్న అసభ్యకర టివి సీరియల్స్‌ను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి అభిప్రాయపడ్డారు. నగరంలో శుక్రవారం జరిగిన మహిళా అవగాహన సదస్సులో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టివి సీరియల్స్ ఎక్కువ భాగం మహిళను కించపరిచేవిధంగా ఉంటున్నాయని, ప్రజల్లో మంచి భావాలు నెలకొనే విధంగా టివి సీరియల్స్ ప్రసారం చేయాల్సి ఉందన్నారు. మహిళలకు ఉపకరించే, వారి గౌరవానికి భగం వాటిల్లని కార్యక్రమాలు ప్రసారం చేయడం ద్వారా మహిళా లోకానికి సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత ప్రసార మాధ్యమాలపై ఉందన్నారు. వివిధ సమస్యలపై పోలీసు స్టేషన్లను ఆశ్రయిస్తున్న మహిళల కోసం పోలీసు స్టేషన్లలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. మహిళా ప్రత్యేక సెల్‌లో మహిళా ఎస్సై, కానిస్టేబుల్స్‌ను నియమించే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి నిమిత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై మహిళలకు అవగాహన కల్పించేందుకు విస్తృత చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. సమాజంలో మహిళలు అనేక విధాలుగా హింస, వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భ్రూణ హత్యలు, ఆడపిల్లలపై అత్యాచారాలు, మహిళలపై దాడులు ప్రస్తుత కాలంలో పెరిగిపోయాన్నారు. మహిళల్లో చోటుచేసుకుంటున్న భావాలు వారి జీవితాన్ని అగాధంలోకి నెట్టేస్తున్నాయని, చిన్న విషయానికే మాట పట్టింపులు, విడాకులు తదితర అంశాలతో బాంధ్యవ్యాలను తెంచుకునే వరకూ దారితీస్తున్నాయన్నారు. చట్టాల్లో ఉన్న లోపాలను సరిదిద్ది సమర్ధవంతంగా వాటిని అమలు చేసినప్పుడే మహిళలకు సమ న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. బాల్య వివాహాల నిర్మూనకు చట్టాలున్నప్పటికీ తల్లిదండ్రుల్లో అవగాహన లేమికారణంగా ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు. బాలికల్లో అనారోగ్య సమస్యలు, రక్త హీనత వంటి రుగ్మతలు వారి జీవన ప్రమాణాలపై ప్రభావాన్ని చూపుతున్నాయని, ఈ సమస్యను అరికట్టేందుకు పౌష్టికాహారం అందించాల్సి ఉందన్నారు. అలాగే తల్లిదండ్రులు బంధుత్వాలు, వివాహ వ్యవస్థపై చిన్ననాటి నుంచే బాలికలకు అవగాహన కల్పించాలని సూచించారు. సంయుక్త కలెక్టర్ జి సృజన మాట్లాడుతూ మహిళల గౌరవం, వారి రక్షణకు, హక్కుల వినియోగానికి ఎన్నో చట్టాలు వచ్చాయన్నారు. ఇటువంటి సదస్సులు వారిలో అవగాహన కల్పించడంతో పాటు బాధ్యతలను గుర్తు చేస్తాయన్నారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు తగిన శ్రద్ధ తీసుకుంటే విలువలతో కూడిన సమాజ స్థాపన సాధ్యపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఫీల్డ్ పబ్లిసిటీ ఎడి ఎం మహేష్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం కేంద్రం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని, భేటీ బచావో-్భటీ పడావో పథకంతో పాటు బాలికా విద్య, జీవన, రక్షణ హక్కుల పరిరక్షణకు ఎన్నో చట్టాలు తీసుకువచ్చిందన్నారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యులు శ్రీ వాణి, రాజ్యలక్ష్మి, మహిళా,శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ చిన్మరుూదేవి, జిల్లా లీగల్ అధారిటీ సభ్యులు ఉమాదేవి, తదితరులు పాల్గొన్నారు.