విశాఖపట్నం

దేవధర్ ట్రోఫీకి రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), మార్చి 24 : ప్రొఫెసర్ డిబి దేవధర్ ట్రోఫీ క్రికెట్ పోటీలకు ఎసి ఎ-విడిసి ఎ స్టేడియం సిద్ధమయింది. అయిదు రోజుల పాటు పరిమిత ఓవర్ల పద్ధతిలో జరిగే ఈ పోటీలు ప్రేక్షకులను అలరించనున్నాయి. జాతీయ జట్టులో ఆడిన యువ, సీనియర్ క్రికెటర్లు ఈ పోటీల్లో పాల్గొంటుండడంతో మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా జరగనున్నాయి. తొలిరోజు పోటీలో ప్రధాన జట్లయిన ఇండియా బ్లూ, ఇండియా రెడ్ జట్లు తలపడనున్నాయి. విశాఖలో దేవధర్ ట్రోఫీ తొలిసారిగా జరుగుతుండడం, సీనియర్ జట్టులో స్థానం కోసం క్రికెటర్లు పోటీ పడుతుండడంతో ఈ మ్యాచ్‌లకు ప్రత్యేకత ఏర్పడింది. శనివారం ఉదయం 9 గంటలకు తొలిమ్యాచ్ ప్రారంభం అవుతుంది.
ముమ్మర సాధనలో మూడు జట్లు
ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఇండియా బ్లూ జట్టు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎసి ఎ-విడిసి ఎ స్టేడియం ‘బి’ గ్రౌండ్‌లో ముమ్మరంగా సాధన చేసింది. జట్టు కెప్టెన్ హర్భజన్‌సింగ్‌తో పాటు పాండ్య, నదీమ్ బౌలింగ్ చేయగా, బ్యాటింగులో అంబటిరాయుడు, దీపక్ హుడా, మనోజ్ తివారీ సాధన చేశారు. అనంతరం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇండియా రెడ్ జట్టు ఆటగాళ్లు స్టేడియంలోని నెట్స్‌లో పాల్గొన్నారు. ముఖ్యంగా శిఖర్‌ధావన్ ఎక్కువ సేపు బ్యాటింగ్ చేశాడు. మిగతా ఆటగాళ్లు ఫిట్‌నెస్‌లో ఎక్కువ సేపు గడిపారు. పోటీల్లో మూడవ జట్టుగా స్థానం దక్కించుకునేందుకు తమిళనాడు జట్టు కూడా ప్రాక్టీస్ చేసింది.
రోహిత్, కేదార్ గైర్హాజర్
ఈ పోటీల్లో ఇండియా బ్లూ జట్టులో కెప్టెన్‌గా వ్యవహరించాల్సిన రోహిత్‌శర్మ గాయం నుండి పూర్తిగా కోలుకోకపోవడంతో పోటీల నుండి వైదొలిగాడు. ఈ టోర్నమెంట్ ద్వారా ఫిట్‌నెస్ నిరూపించుకుని సీనియర్ జట్టులో స్థానం దక్కించుకుంటాడని, స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్‌శర్మ బ్యాటింగులో మెరుపులు చూడాలని ఎంతో ఆశించిన ప్రేక్షకులు నిరాశకు గురి కాక తప్పదు. రోహిత్‌శర్మ స్థానంలో హర్భజన్‌సింగ్ నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. అలాగే ఇండియా రెడ్ జట్టులో ప్రధాన ఆల్‌రౌండర్ కేదార్‌జాదవ్ కూడా గైర్హాజర్ కావడం ఆ జట్టుకు పెద్ద దెబ్బని చెప్పాలి.
పిచ్ బ్యాటింగుకు అనుకూలం
పరిమిత ఓవర్ల పద్ధతిలో జరిగే ఈ మ్యాచ్‌ల కోసం పిచ్‌ను పూర్తిగా బ్యాటింగుకు అనుకూలంగా రూపొందించడం జరిగిందని బిసిసి ఐ క్యూరేటర్ శ్రీరామ్ ఆంధ్రభూమి విలేఖరికి తెలిపారు. శనివారం జరిగే తొలిమ్యాచ్ సిండర్‌పిచ్‌పై జరుగుతుందని, ఈ టోర్నమెంట్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే జరుగుతుండడంతో ఈ పోటీల కోసం రెండు పిచ్‌లు సిద్ధం చేశామని తెలిపారు. ఈ పిచ్‌లపై బ్యాట్స్‌మెన్ పరుగుల వరద సృష్టిస్తారని తెలిపారు.
హర్భజన్‌సింగ్ హల్‌చల్
ఇండియా బ్లూ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ నగరంలో హల్‌చల్ చేశాడు. నగరంలోని ద్వారకానగర్‌లో నూతనంగా ఏర్పాటైన ఆంధ్రా స్పోర్ట్స్ బ్రాంచ్‌లో హర్భజన్‌సింగ్ హాజరై సందడి చేశాడు. హర్భజన్‌సింగ్‌తో సెల్ఫీలు దిగేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. ఈ మ్యాచ్‌లను కవర్ చేస్తున్న మీడియాకు పెవిలియన్‌లోని కార్పొరేట్ బాక్స్‌లో నంబర్-4లో ఏర్పాటు చేశారు. రెండవ అంతస్తులో ఉన్న ఈ కార్పొరేట్ బాక్సును ఇండర్‌నెట్, ఇతర హంగులతో మీడియాకు అనుకూలంగా తీర్చిదిద్దారు.