విశాఖపట్నం

చింతన (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువిలో పుట్టిన జీవరాశులు
కాలవాహిని జనపాత్రధారులు
ఈ రంగం నిమిత్త మాత్రం
ఇక్కడ ఒక్కరైనా మిగిలుంటారా?
అందరం అక్కడి వారమే
నీ నా భావం నెరుగక
విషకౌగిలి వలలు విసరక
సమభావనలు పాదుకొనక
సాగించిన మానవయానం
కళ్లు తెరచి నడిచే వానికి
సమరీతి న్యాయపు
నిజదర్శన మయ్యేదక్కడ
పూలజల్లు కురిసేదక్కడ
ఇక్కడి అందం ఆనందం
తాత్కాలికం
అక్కడి సుందర సుమధురధామం
శాశ్వతం నిత్య సత్యం
ఇక్కడొక్కరైనా మిగిలుంటారా?
అందరం అక్కడి వారమే!
*
ఎల్. రాజాగణేష్,
చైతన్యనగర్, పాతగాజువాక,
విశాఖపట్నం-530026.
సెల్ : 9247483700.
**
యువశక్తిని చాటి చెప్పాలి
*
అవినీతి అంతానికి
పడింది ఒక ముందడుగు
భారతీయులంతా ఒక్కటై
సాగించాలి పోరాటం
మార్పు కోసం పోరాటం సాగించే
వారంతా కలసికట్టుగా సాగాలి
పోరుబాటలో సమరసైనికులై
సాగాలి దివిటీలై
మహానేతలు పోరాడి సాధించిన
స్వాతంత్య్రాన్ని మనమంతా
కలసి కట్టుగా కాపాడుకోవాలి
దేశంలో ఇక ఉండకూడదు
అవినీతి, నల్లధనం, స్వార్ధపరత్వం
అందరూ ఓటు హక్కును
వినియోగించుకోవాలి
సుస్థిర ప్రభుత్వాల
ఏర్పాటులో తోడ్పడాలి
యువశక్తిని ప్రపంచానికి చాటి చెప్పాలి
*
- నాగాస్త్రం నాగు,
గాజువాక, విశాఖపట్నం.
సెల్ : 9966023970.
**

నారీభేరి
*
తిరుగులేని
సర్వశక్తిమంతురాలు
నారి
ఇప్పుడు
అన్నింటా మోగిస్తుంది
భేరి
*
- మాధవీ సనారా,
నిదానందొడ్డి, అనకాపల్లి.
సెల్ : 9440103134.
**

రహదారి భద్రత పాటించు
*
రహదారి భద్రత పాటించుట అవసరం
అది రక్షణకే అని తెలియుట చోదకుని కర్తవ్యం
చట్టాల హెచ్చరికలు బేఖాతరు చేయకండి
ప్రమాదాల తీవ్రత గుర్తెరిగి వ్యవహరించండి
కారులో రక్షణకు బెల్టు వచ్చెను
ద్విచక్ర వాహనమునకై శిరస్త్రాణం పుట్టెను
చోదక వేగం అదుపులో పెట్టని నాడు
ప్రాణములే గాలిలో కలియును నాడు
శిరస్త్రాణం ధరించడం అవమానంగా తలచకండి
అధిక వేగం అనే ఆలోచన అనర్థమనండి
ట్రాఫిక్ నిబంధనలను నిర్లక్ష్యం చేయకండి
జీవితం, కుటుంబం ఛిద్రమగునని తెలుసుకోండి
అతి వేగం, అశ్రద్ధ అపాయమ్మురా
వీటిని విస్మరిస్తే మృత్యువే కౌగలించురా
*
- సుసర్ల సర్వేశ్వరశాస్ర్తీ, ఎంవిపికాలనీ,
విశాఖపట్నం. సెల్ : 9989397651.
**

అద్భుత అమరావతి
*
రాష్ట్రంలో అన్ని గ్రామాల మట్టిని ఒకచోట చేర్చడం
ఆ మట్టిని పుణ్యనదీ జలాలతో పవిత్రం చేయడం
అందరి రాజధానిగా అమరావతిని భావించడం
అమరావతి యజ్ఞ పరిమళ ధూపం
నేలా నింగిని ఏకం చేయుట మంచి భవితకు సంకేతం
ఆనాటి ఆంధ్ర రాజధాని అమరావతి ఆదర్శం
దివిలో ఇంద్రుని రాజధాని ఆ అమరావతి నగరం
భువిలో చంద్రుని రాజధాని ఈ అమరావతి నగరం
శైవం, వైష్ణవం, బౌద్ధం పరిఢవిల్లిన ప్రాంతం
పంచారామాలలో ఒకటి అమరలింగేశ్వరం
కాబోయే అమరావతి నగరం ప్రపంచ అద్భుతం
కృష్ణా నదీ తీరాన అమరావతి నగర నిర్మాణం
ఇది తొమ్మిది నిర్మాణ విభాగాల హారం

- ఆదిలక్ష్మీ పుత్ర అన్ను,
చినవాల్తేరు, విశాఖపట్నం. సెల్ : 9441344503.
**
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.