విశాఖ

తూర్పు కనుమల్లో మావోయిస్టుల కదలికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడెంకొత్తవీధి, ఏప్రిల్ 16: ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదిలికలు పెరుగుతుండడంతో సరిహద్దు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటీవల సరిహద్దు ప్రాంతంలో జరిగిన సంఘటన నేపధ్యంలో గ్రేహౌండ్స్ బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేసారు. వరుస ఎన్‌కౌంటర్‌లతో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మావోయిస్టులు గత కొంత కాలంగా వౌనంగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో మరలా మావోయిస్టుల కదిలికలు పెరిగాయన్న ఇంటిలిజెన్స్ సమాచారంతో రెండు రాష్ట్రాల పోలీసు బలగాలు అప్రమత్తమై గాలింపు చర్యలను ముమ్మరం చేసాయి.
సీలేరులో
సీలేరు: ఆంద్రా - ఒడిశా సరిహధ్దుల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఉండడంతో మావోయిస్టు కటాఫ్ ఏరియాల్లో పోలీసు బలగాలు మోహరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మావోయిస్టులకు అనుకూలంగా సహకరిస్తున్న అనేక మంది గిరిజనులు, సానుభూతి పరులు స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోవడంతో పోలీసులు వారికి పునరావాస చర్యలు చేపడుతున్నారు. అదే విధంగా పప్పులూరు, ఎం. ఎ.వి. 79, బలిమెల తదితర ప్రాంతాల్లో పోలీసులు కూబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేస్తున్నారు. ఇదే రహదారిలో పలు వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి విడిచి పెడుతున్నారు. మల్కన్‌గిరి, ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో కూడా మావోయిస్టులు పలు చర్యలకు పాల్పడుతుండడంతో ఇరు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా కూబింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో మావోయిస్టులు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా మావోయిస్టులను పూర్తిగా తుదముట్టించేందుకు ఆంధ్రా - ఒడిశా ఇరు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మావోయిస్టులు విస్తృత కూబింగ్‌లు నిర్వహిస్తుండడంతో ఎప్పుడేం జరుగుతుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.