విశాఖ

జూన్ నాటికి పొగరహిత జిల్లాగా విశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం, ఏప్రిల్ 20: వచ్చేజూన్ నెలాఖరునాటికి విశాఖను పొగరహిత జిల్లాగా గుర్తించేందుకు జిల్లాకలెక్టర్ చేస్తున్న కృషికి ప్రజల సహకారం అందించాలని స్థానిక మండల ప్రత్యేక అధికారి కెఎస్ శాస్ర్తీ కోరారు. అంతకాపల్లిలో గురువారం నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత దేశంలో ప్రతీ గృహిణి పొగచూరే పొయ్యిలతో బాధలు పడకుండా ఉండేందుకు అందరికీ గ్యాస్ కనెక్షన్‌లు ఉచితంగా అందించేందుకు ప్రధాని నరేంద్రమోదీ రూప కల్పన చేశారన్నారు. దీంతో మన కలెక్టర్ రాష్ట్రంలోనే పొగరహిత జిల్లాగా తయారు చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నారని ఆయనకు ప్రజలు సహకరించాలని కోరారు. సర్పంచ్ చొక్కాకుల గోవింద్,తహశీల్దార్ ఎం.ఆనందకుమార్, మాజీ ఎంపిపి ఎస్.ముత్యాలనాయుడు, ఐసిడిఎస్ సిడిపివో కె.శ్రీ గౌరి, గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఇరిగేషన్, హౌసింగ్ ఎఇలు ఎం.అప్పలరాజు, జ్యోతిబాబు, శేఖర్, వెలుగు ఎపిడి బివి రమణ, ఎంఇవోఆర్‌ఆర్‌కె నర్సింగరావు, నారాయణమూర్తి పాల్గొన్నారు.

పెరిగిన సిమెంట్ ధరతో నిలిచిన నిర్మాణాలు
అనకాపల్లి(నెహ్రూచౌక్), ఏప్రిల్ 20: సిమెంట్‌తోపాటు ఇనుము, ఇటుక, పిక్క, ఇసుక వంటి మెటీరీయల్ ధరలు ఆకాశాన్ని అంటడంతో పేద, మధ్యతరగతి ప్రజల సొంత ఇంటికల కలగానే మిగలనుంది. మార్చి నెలకు ప్రస్తుతం ఉన్న సిమెంట్ ధరలకు వ్యత్యాసం ఉంది. బస్తా ఒక్కంటికి సుమారు 100రూపాయలు పైనే ధర పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఈ ధరలు చూసి ఆందోళన చెందుతున్నారు. మార్చినెలలో అన్ని వర్గాల వారికి ధర విషయంలో అన్ని కంపెనీల కలుపుకొని 5, 10 రూపాయల తేడాతో 270 రూ.లు ఉండేదని, ఏప్రిల్ మొదటి వారం నుండి సిమెంట్ పరిశ్రమలు అన్ని సిడికేట్ అయి కృత్రిమ కొరత సృష్టించి ఉన్నపలంగా బస్తాకి 100రూ.లు అదనంగా పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపి వారి ఆశలు అడియాశలు చేశారని భవన నిర్మాణ యజమానులు లబోదిబోమంటున్నారు. సిమెంట్‌తో
పాటు ఇనుము, ఇటుక, ఇసుక, పిక్క తదితర మెటీరీయల్ ధరలు కూడా తీవ్రరంగా పెరిగిపోవడంతో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ ధరలుతో ఆయా మెటీరీయల్ కొనుగోలు చేయలేక గత రెండు వారాలు నుంచి భవన నిర్మాణ పనులు నిలిచిపోయన పరిస్థితి నెలకొంది. దీంతో అనకాపల్లి పరిసర గ్రామాలుతోపాటు సుదూర ప్రాంతాలు నుండి రోజుకు వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు పట్టణంలో ఉడ్‌పేట వాటర్ ట్యాంక్ సెంటర్, గవరపాలెం పార్కుసెంటర్‌కు చేరుకొని కూలి పనులు ఎదుక్కొని వెళ్తుంటారు. అయితే పెరిగిన ధరలుతో భవన నిర్మాణ పనులు నిలిచిపోవడంతో నేడు వారిని కూలిపనులకు పిలిచేనాథుడే కరవయ్యారు. కూలి అడితే కుండాడని వీరికి రెండువారాలుగా పనులు లేక నిరాశతో ఇంటిమొఖం పడుతున్నారు. గతంలో 50 బస్తాలు కొనుగోలు చేసినవారు సైతం తప్పనిసరి పరిస్థితిల్లో 10 బస్తాలు కొనుగోలు చేసి భవన నిర్మాణ యజమానులు అరకొర పనులు చేయిస్తున్నారు. దీంతో సిమెంటు అమ్మకాలు 70శాతం తగ్గిపోవడంతో వ్యాపారులు అందోళన చెందుతున్నారు. ఇదే ధరలు కొనసాగితే భవిష్యత్‌లో పేద, మధ్య తరగతిప్రజలు సొంత ఇంటిని నిర్మించుకోవాలనే కలను విరమించుకొనే పరిస్థితి ఉంది. కృత్రిమ కొరత సృష్టించి ఉన్న పలంగా పెంచిన ధరలతోప్రజలు, కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నాప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేకపోవడాన్ని చూసిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.