విశాఖ

ఎటిఎంలలో నో క్యాష్‌పై వైసిపి ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి(నెహ్రూచౌక్), ఏప్రిల్ 20: నల్లధనాన్ని వెలికితీస్తామన్న వంకతో అర్ధంతరంగా పెద్దనోట్ల రద్దును ప్రకటించిన కేంద్రప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో గడిచిన ఏడు నెలలు నుండి పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైసిపి పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు ఆరోపించారు. ఎటిఎం కేంద్రాల్లో నగదు లేకపోవడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ స్థానిక నెహ్రూచౌక్ ఎస్‌బిఐ ఎటిఎం కేంద్రం వద్ద జానకిరామరాజు ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యామయ మార్గం లేకుండా అనాలోచిత నిర్ణయంతీసుకొని పెద్దనోట్ల రద్దు ప్రకటించడంతో అన్ని వర్గాలవారు ఏడు నెలలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏప్రిల్ 1నుండి పట్టణంలో ఉన్న అన్ని ఎటిఎం కేంద్రాల్లో నగదు లేకపోవడం వలన ప్రజలు నానా అవస్థలు పడుతున్నారన్నారు. అలాగే బ్యాంకు ఖాతాదారులపై అనేక నిబంధనలు విధించడంతో డబ్బులు వేసి తీసుకోవడానికి పలు అవస్థలు పడుతున్నారన్నారు. నల్లకుబేరులను వదిలేసి దేశంలో చిన్నా చితక సుమారు 70 కోట్ల మంది బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారని, నేడు వారు పనులు మానుకొని నగదుకోసం బ్యాంకులు చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఎటిఎం కేంద్రాల్లో అరకోర నగదు సరఫరా చేస్తూ బ్యాంకు ఖాతాదారులకు చుక్కలు చూపిస్తున్నారని, రానురాను ఎటిఎం కేంద్రాలను మూసివేసే దిశగా కన్పిస్తుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పట్టణ ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి రమణ అప్పారావు, పట్టణ విభాగ అధ్యక్షుడు జాజుల రమేష్ మాట్లాడుతూ ఖతాదారులకు నగదు అందుబాటులో ఉంచడంలో బ్యాంకులు విఫలమయ్యాయని ప్రజలు నగదుకోసం వెంపర్లాడి తిరుగుతున్నారని ఆరోపించారు. ఖాతాదారులపై విధించిన నిబంధనలు తక్షణం తొలగించి అన్ని ఎటిఎం కేంద్రాల్లో అన్ని వెలలా నగదు ఉండే విధంగా చర్యలు తీసుకొని ప్రజలు ఇబ్బందులను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఒమ్మి రాము యాదవ్, వేగి త్రినాథరావు, మూనూరు శ్రీను, గైపూడి రాజు, ఏడువాకల నారాయణరావు, కుండల రామకృష్ణ, మళ్ళ రామచంద్రరావు పాల్గొన్నారు.