విశాఖ

ప్రాణాంతక వ్యాధుల అదుపునకు ప్రత్యేక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, ఏప్రిల్ 20: ప్రాణాంతక వ్యాధులైన మలేరియా, డయేరియా మహమ్మారిని అదుపు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జె.గురునాధరావు అన్నారు. గురువారం డుంబ్రిగుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యులు గిరి వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న తీరుతెన్నుల వివరాలను అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది తగ్గుముఖం పట్టినట్టు రికార్డుల పరిశీలన ద్వారా తెలిసిందన్నారు. అనంతగిరి పి.హెచ్.సి.లో మలేరియా వ్యాధిగ్రస్తులు ఉన్నట్టు రికార్డుల పరిశీలిన ద్వారా తేలిందన్నారు. ఈ ఏడాది పెదబయలు మండలంలో మలేరియా కేసులు తక్కువగా నమోదయ్యాయని చెప్పారు. ప్రస్తుత ఎపిడమిక్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఎవరికీ ఎటువంటి ప్రాణాంతక మలేరియా, డయేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా ముందస్తు చర్యలో భాగంగా డివిజన్ పరిధిలో ఉన్న పి.హెచ్.సి. వైద్యులు ప్రత్యేక వైద్య శిబిరాల ఏర్పాటు ద్వారా గిరిజనులకు చికిత్సలు అందించాలని ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు.
మలేరియా మరణాలు సంభవిస్తే వేటు తప్పదు
ఏజెన్సీలో 36 పి.హెచ్.సి.లో పరిధిలో ఉన్న ఏ మండలంలో కూడా భవిష్యత్‌లో మలేరియాతో మృతి చెందినట్టు తెలిస్తే అటువంటి వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఎ.డి.ఎం.అండ్.హెచ్.ఒ అన్నారు. ఈ దిశలో వైద్యులు అదుపుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈకార్యక్రమంలో అరకు మలేరియా సబ్ యూనిట్ అధికారి సింహాచలం, జిల్లా మలేరియా అధికారి ఒ.సింహాచలం, వైద్యాధికారిణి కాంతికిరణ్ తదితరులు పాల్గొన్నారు.