విశాఖపట్నం

గంగమ్మతల్లి ఆలయ పునఃప్రతిష్ఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, ఏప్రిల్ 20: మండలంలోని పద్మాపురం మేజర్ పంచాయతీ యండపల్లివలసలో శ్రీ గంగమ్మతల్లి ఆలయ పునః ప్రతిష్ఠ కార్యక్రమం గురువారం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఈ కార్యక్రమాన్ని కన్నుల పండువగా చేపట్టారు. భీమినిపట్నం, కోటబొమ్మాళి, అరకులోయ అర్చకులు సూరిబాబు శర్మ, రాజేష శర్మ, ప్రదీప్ శర్మ, నాగేష్ శర్మ, వెంకటేష్ శర్మ అమ్మవారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాన్ని పునః ప్రతిష్ఠించారు. పురాతన ఆలయాన్ని నేలమట్టం చేసి అదే స్థానంలో నూతన అమ్మవారి ఆలయాన్ని నిర్మించి ఆలయ పునః ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ గంగమ్మ తల్లి ఆలయ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 22వ తేదీ వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గంగమ్మతల్లి ఆలయ కమిటీ ప్రతినిధులు, వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

భగ్గుమన్న భానుడు
సబ్బవరం, ఏప్రిల్ 20: మండలంలో ఎండలు మండి పోతున్నప్పటికీ గురువారం ఆ తీవ్రత రెట్టింపుకావటంతో భానుడి గ్రీష్మతాపానికి ప్రజలు అల్లాడిపోయారు. ఉదయం 11 గంటలకే బయట తిరగలేని పరిస్థితి దాపురించిందంటే అతిశయోక్తికాదు. ఇక ఉపాధి పనులకు చెరువుల్లో పూడిక తీత పనుల కోసం వెళ్ళిన కూలీలు ఎండకు తట్టుకోలేక చెట్లనీడలేక, తాగేందుకు నీరు అందుబాటులోలేకపోవటంతో ఉదయం 10.30 గంటలకే ఇంటి ముఖం పట్టారు. సబ్బవరంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. శీతల పానీయాల దుకాణాలు కిటకిటలాడాయి. అంతేకాకు మోటారు వాహనాలపై ప్రయాణించిన వారు సైతం ముఖాలకు స్కార్ప్‌లు, ముసుగులు ధరించి ప్రయాణాలు చేశారు. మహిళలయితే తమ చీర కొంగులే రక్షణ కవచంగా ముసుగులు వేసుకుని కాలినడకన ప్రయాణించారు. అంతేకాకుండా ఉక్కపోత కారణంగా ఇళ్ళలో కూడా ప్రజలు గడపలేకపోయారు. శీతల పానీయాలు, చెరుకు రసం, పుచ్చకాయల దుకాణాల వద్ద వినియోగదారుల రద్దీ పెరిగింది. అయితే, గత ఏడాది విద్యుత్ కోతల కారణంగా ఇబ్బంది పడిన శీతల పానీయాల వ్యాపారులకు వేసవి కరెంటు కోతల కష్టాలు తప్పాయి.