విశాఖపట్నం

ప్రతి నీటి బిందువును సంరక్షించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోడవరం, ఏప్రిల్ 20: ప్రతీ నీటి బిందువును సంరక్షించుకుని అంగుళం భూమి కూడా విడిచిపెట్టకుండా పంటపొలాలను సాగులోనికి తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్యేయమని ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు అన్నారు. గురువారం నీరు-ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని రాయపురాజుపేట గ్రామంలో భూలోకమ్మ చెరువులో పదిలక్షల రూపాయలతో పూడికతీత పనులను ప్రారంభించారు. అలాగే అధికారులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో స్థానిక కొత్తూరు జంక్షన్ నుండి మండల పరిషత్ కార్యాలయం వరకు నీటి ప్రాముఖ్యతను తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల పరిషత్ సమావేశ భవనంలో ఈ సందర్భంగా ప్రత్యేక సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. నీటిని వృథా చేయకుండా ఉన్ననాడే భూగర్భజలాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఒక ప్రణాళికాబద్దంగా నీటి సంరక్షణా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలన్నారు. అధికారులు, స్థానికులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఉన్న నాడే వ్యవసాయ రంగం అభివృద్ధిలో నడిచేందుకు అవకాశముందన్నారు. సుమారు ఏడు గ్రోయిన్లకు 10.45కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. కార్యక్రమం అనంతరం నీరు-ప్రగతి ప్రతిజ్ఞను నిర్వహించారు. నీటిపారుదల శాఖ ఎస్‌ఇ ఆర్. నాగేశ్వరరావు, ఎంపీడివో చిట్టిరాజు, ప్రత్యేకాధికారి వెంకటేశ్వరరావు, ఎంపిపి గూనూరు కొండతల్లి, గోవాడ సుగర్స్ చైర్మన్ మల్లునాయుడు, జెడ్‌పిటిసి కనిశెట్టి మత్స్యరాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మజ్జి గౌరీశంకర్, మాజీ ఎంపిపి సత్యనారాయణ, సర్పంచ్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

‘30లోపు ఆస్తిపన్ను చెల్లించి
5 శాతం రాయితీ పొందండి’
జగదాంబ, ఏప్రిల్ 20: జీవిఎంసికి సంబంధించి 2017-18 ఆర్ధిక సంవత్సరానికిగాను ఆస్తిపన్ను, నీటిపన్ను, ఖాళీ స్థలం పన్నులను ఏప్రిల్ 30లోపు చెల్లించి ఐదు శాతం రాయితీ పొందాలని కమిషనర్ హరినారాయణనర్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఆస్తిపన్ను, నీటిపన్ను, ఖాళీస్థలం పన్నుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచినందున ఎటువంటి బిల్లు, డిమాండ్ నోటీసు లేకుండా చెల్లించవచ్చనన్నారు. జీవిఎంసి సౌకర్యం, మీ సేవా కేంద్రాలు, బ్యాంకులు (యాక్సిస్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, కోటక్ మహీంద్రా, స్టేట్‌బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ (ఇండియా), ఐడిబిఐ, ఎస్.బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు బ్రాంచీల్లో) జీవిఎంసి డాట్‌గావ్‌డాట్‌ఇన్/ స్మార్ట్ వైజాగ్ యాప్ ద్వారా చెల్లించవచ్చన్నారు. ఏప్రిల్ 30వ తేదీలోపు ఆస్తిపన్నును ఏకమొత్తంగా చెల్లించి సంవత్సర పన్నులో ఐదు శాతం రాయితీ పొందాలన్నారు.
ఆకట్టుకున్న రోబోటిక్ జంతు ప్రదర్శన
జగదాంబ, ఏప్రిల్ 20 : ఆంధ్రా యూనివర్శిటీ స్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన రోబోటిక్ జంతు ప్రదర్శనను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరవాసులకు వేసవి సీజన్‌లో ఆహ్లాదం పంచడానికి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. విశాఖ చరిత్రలోనే తొలిసారిగా ట్రిక్ ఆర్ట్ సెల్ఫీషో, రోబోటిక్ జంతువుల ప్రదన్శన ఏర్పాటు చేయడంతో ఎంతో ఆకట్టుకుందన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ ప్రత్యేక అనుమతి ఇవ్వాలని అన్నారు. ఈ ఎగ్జిబిషన్‌లోనే నగరంలో థీమ్ పార్కుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎయు రిజిస్ట్రార్ వి. ఉమామహేశ్వరరావు, జె. సత్యనారాయణ, నిర్వాహకులు రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను మంత్రి ఆసక్తిగా తిలకించారు.