విశాఖపట్నం

చదువుపై ఆసక్తి కల్పించేందుకే బడికొస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, ఏప్రిల్ 20: బాలికల్లో ఆత్మవిశ్వాసం, చదువుకోవాలనే ఆసక్తి కల్పించడానికే ‘బడికొస్తా’ పథకం ద్వారా విద్యార్థినులకు ఉచిత సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం ప్రవేశపెట్టామని రాష్ట్ర విద్యాశాఖ, మానవనరులశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఆర్‌కె బీచ్, ఎన్టీఆర్ కూడలి వద్ద నగరంలో జివిఎంసి, ప్రభుత్వ, ఎయిడెడ్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థినులకు మంత్రి సైకిళ్ళను పంపిణీ చేశారు. వారితో పాటు తాను కూడా సైకిల్ తొక్కి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ ఏడాది బడ్జెట్‌లో అధిక నిధులను కేటాయించడం జరిగిందన్నారు. ఆర్థికంగా వెసులుబాటు లేని కుటుంబాలకు ఆసరగా నిలిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాలికలు చదువు మధ్యలో మానకుండా అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశ్యంతో వారికి ఉచిత సైకిళ్ళ పంపిణీ శ్రీకారం చుట్టారన్నారు. రాష్టవ్య్రాప్తంగా 9వ తరగతి చదువుతున్న 1,81,556 మంది విద్యార్థీనులకు ఉచితంగా సైకిళ్ళ పంపిణీ చేపట్టడం జరుగుతుందన్నారు. వీటికి రూ.75 కోట్ల ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ, జిల్లాపరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, మోడల్ స్కూల్‌ల్లో చదువుతున్న వారికి ఉచిత సైకిళ్ళ పంపిణీ చేయనున్నామన్నారు. జిల్లాకు 12,172 సైకిళ్లు మంజూరు చేసినట్టు తెలిపారు. బాలికలు లక్ష్యసాధన దిశగా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలన్నారు. విద్యారంగంలో అనేక నూతన సంస్కరణలు తీసుకువస్తున్నామన్నారు. ఆడపిల్లలు ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్‌లో కూడా శిక్షణివ్వడం జరుగుతుందన్నారు. రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాల్లోను ప్రవేశపెట్టనున్నామన్నారు. జూన 12వ తేదీన పాఠశాలల పునఃప్రారంభం రోజున పిల్లల తల్లిదండ్రులను పాఠశాలలకు రప్పించి పిల్లలతో వారికి పాధాభివందనం చేయించి దీవెనలు పొందే కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. సభకు స్వాగతం పలికన కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రజాసంక్షేమంలో ఆరోగ్యం, విద్య, ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని అందుకు ప్రభుత్వం ఈ రెండు రంగాలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సరైన రవాణా సౌకర్యాలు లేక, మధ్య, దిగువ తరగతి కుటుంబాలు ఖర్చు భరించలేక పోవడం వంటి పలు కారణాలతో డ్రాపౌట్స్ ఎక్కువుగా ఉంటున్నాయని, నగరంలో కూడా ఇదే పరిస్థితి ఎదురౌతుందని, వీటికి అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం బడికొస్తా కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. సైకిల్ వాడకం వలన సకాలంలో బడికి పిల్లలు చేరుకుంటారన్నారు. అలాగే వారి ఆరోగ్యపరంగా కూడా బాగుంటుందన్నారు. ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమం శాస్ర్తియ పద్ధతిలో నమోదు చేసి పిల్లల ఆధార్ కార్డులతో అనుసంధానం చేస్తూ పంపిణీని పారదర్శకంగా నిర్వహించనున్నారన్నారు. విశాఖ ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వైజ్ఞానిక సమాజంగా రాష్ట్రాన్ని మార్చడానికి ఇటువంటి పథకాలు దోహదపడతాయన్నారు. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలు చదువుకుంటే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లా ప్రజాపరిషత్ చైర్‌పర్సన్ లాలం భవానీ మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకూడదని సానుకూల ద్పక్పథంతో ముందుకు సాగాలన్నారు. శాసనసభ్యులు పి.విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ ఈ పథకం మహిళలకు, పురుషులకు వర్తింపుచేస్తే బాగుంటుందని మంత్రిని కోరారు. ముఖ్యమంత్రి 68వ పుట్టినరోజు సందర్భంగా గౌరవ సూచికంగా మంత్రి, పార్లమెంటుసభ్యులు, శాసనమండలి, శాసనసభ్యులు, జిల్లాప్రజాపరిషత్ చైర్‌పర్సన్ కేక్ కట్ చేశారు. అనంతరం మంత్రి గంటా జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, జెసి-2 డివి రెడ్డి, ఇన్‌చార్జి డిఇఓ నాగమణి, ఇతర అధికారులు అధిక సంఖ్యలో బాలికలు పాల్గన్నారు.