విశాఖపట్నం

కాలుష్యరహితమైతేనే భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 20: కాలుష్య రహితమైతేనే భవిత. పర్యావరణ హితమైన భారత దేశాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యతతో ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల్లో కార్బన్ శాతాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తోందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అన్నారు. నగరంలో మూడు రోజుల పాటు జరగనున్న 21వ రిఫైనరీ టెక్నాలజీ మీట్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దీనిలో భాగంగానే కాలుష్య కారక వాహనాలను పూర్తిగా నిషేధించేందుకు ప్రభుత్వం వెనుకాడలేదని గుర్తు చేశారు. స్వచ్ఛ భారత్ కోసం మహిళలకు గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా మంజూరు చేసేందుకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ప్రారంభించామన్నారు. సబ్సిడీ ధరకు అర్హులకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నామని, సగటున సంవత్సరానికి 5 సిలిండర్లు ఈ పథకం కింద గృహిణులకు అందుతాయన్నారు. ఇక చమురు శుద్ధి రంగంలో భారత్ గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద చమురు శుద్ధి రిఫైనరీ మనదేశంలో ఉందన్నారు. పెట్రోలియం శాఖ కార్యదర్శి కెడి త్రిపాఠి మాట్లాడుతూ చమురుశుద్ధి రంగంలో సుస్థిర ప్రగతి సాధించే దిశగా భారత్ ముందుకు సాగుతోందన్నారు. అలాగే సంప్రదాయ ఇంధన వనరుల వినియోగంలో కూడా అవకాశాలు పెంచుకుంటోందన్నారు. ప్రపంచ చమురు వినియోగంలో భారత్ 7వ స్థానంలో ఉందన్నారు. భవిష్యత్ ఇంధన అవసరాలను దృష్టిలో ఉంచుకుని చమురు శుద్ధి సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చిన్నచిన్న రిఫైనరీలను నిర్మించుకోవడం ద్వారా అవసరాలను సాధించుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు. చమురు శుద్ధిలో నీటి వినియోగాన్ని సాధ్యమైనంత వరకూ తగ్గించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాంకేతికతను పెంచుకోవడం ద్వారా భూగర్భ, నదీ జలాల వినియోగాన్ని తగ్గించుకుని, రీసైక్లింగ్, డీ శాలినేషన్ నీటిని వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనికి తగ్గట్టుగానే భవిష్యత్ చమురు శుద్ధి కర్మాగారాలు సమగ్రంగా ఉండాల్సి ఉందన్నారు. పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి (రిఫైనరీస్) సందీప్ పౌండ్రిక్ మాట్లాడుతూ 1990 నాటికి 52 మిలియన్ మెట్రిక్ టన్నుల ఇంధన శుద్ధి సామర్థ్యం ఉన్న భారత్ ఇప్పుడు 230 మిలియన్ టన్నుల ఇంధన శుద్ధి సామర్థ్యం కలిగి ఉందన్నారు. చమురు శుద్ధి సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన తక్షణ అవసరం భారత్ ముందుందన్నారు. భవిష్యత్‌లో కాలుష్య రహిత ఇంధన ఉత్పత్తికోసం రూ.30వేల కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు. హెచ్‌పిసిఎల్ సిఎండి ఎంకె సురాన మాట్లాడుతూ రిఫైనరీలు శుద్ధి సామర్థ్యాన్ని పెంచుకునే క్రమంలో మనుగడ, సుస్థిరత వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈ క్రమంలో ఆధునిక సాంకేతికత ఎంతో అవసరమని, ఎదురయ్యే సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో పలు అంశాలపై చర్చలు, సమగ్ర ప్రసంగాలు ఉంటాయన్నారు. దేశ,విదేశాల నుంచి వచ్చిన నిపుణులు, వివిధ చమురు శుద్ధి కర్మాగారాల ఉన్నతాధికారులు పలు అంశాలపై చర్చించనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా 2015-16 సంవత్సరానికి గాను రిఫైనరీ ఎనర్జీ పెర్ఫార్మెన్స్ కింద వివిధ అవార్డులను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ చేతుల మీదుగా అందజేశారు.
స్ఫూర్తిదాయకం వీరుల సాహసం

విశాఖపట్నం, ఏప్రిల్ 20: భారత నౌకాదళంలో అత్యంత సహసాన్ని ప్రదర్శించి, అమరులైన వారిని స్ఫూర్తిగా తీసుకుని నౌకాదళ సిబ్బంది పనిచేయాలని నేవీ చీఫ్ సునీల్ లాంబా విజ్ఞప్తి చేశారు. నౌకాదళంలో అత్యంత ధైర్య, సాహసాలను ప్రదర్శించిన వారికి, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన పతకాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నేవీ అధికారులు, వారి కుటుంబ సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ తూర్పు నౌకాదళ పనితీరు అద్భుతంగా ఉందని అన్నారు. ఇక్కడి సైనికుల క్రమశిక్షణ తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు. కష్టపడి పనిచేయడం ద్వారా అనేక విజయాలను సాధించగలని నౌకాదళంలో అనేక మంది రుజువు చేశారని అన్నారు. ఇక్కడి సైనికుల ధైర్య సాహసాలు కమాండ్ ప్రతిష్ఠను పెంచుతున్నాయని లాంబా అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ నౌకాదళానికి మంచి గుర్తింపు ఉందని అన్నారు. సమిష్టి కృషి నేవీ సామర్థ్యాన్ని పెంచుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదని ఆయన చెప్పారు. భారత దేశ భద్రత నేవీపై ఆధారపడి ఉందని, దాన్ని ఎప్పుడూ వమ్ము చేయబోమని లాంబా స్పష్టం చేశారు. దినదినాభివృద్ధి చెందుతున్న భారత నౌకాదళం ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఆయన తెలియచేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు నౌకాదళ అధికారి బిస్త్ తదితరులు పాల్గొన్నారు.