విశాఖపట్నం

ప్రత్యేక రాయితీతో ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 29: స్థానిక సంస్థల్లో ఆస్తిపన్ను చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన 5 శాతం రాయితీ పథకం మంచి ఫలితాలిచ్చింది. జూన్ 30తో ముగిసే తొలి అర్ధసంవత్సరం పన్ను మొత్తాన్ని ఈ నెలాఖరు లోగా చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో సుమారు 4.5 లక్షల ఆస్తిపన్ను అసెస్‌మెంట్లు ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన రాయితీ పథకానికి మంచి స్పందన లభించింది. ఏప్రిల్ 28 నాటికి రూ.29కోట్ల మేర పన్నులు చెల్లించారు. ఆస్తిపన్ను చెల్లింపులో రాయితీ పథకానికి ఆదివారం ఒక్కరోజే గడువుంది. రాయితీ ప్రకటించిన నేపథ్యంలో జివిఎంసి పరిధిలోని అన్ని జోనల్ కార్యాలయాలతో పాటు అనకాపల్లి, భీమునిపట్నం విలీన మున్సిపాలిటీల్లో ఆదివారం కూడా పన్నులు స్వీకరించనున్నట్టు జివిఎంసి డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ రవీంద్ర తెలిపారు.

విఆర్ చిట్స్ బాధితులకు
అసలు పంపిణీ చేయాలి
* కోర్టు ఆర్డరు ప్రకారం అసలు, వడ్డీ చెల్లించాలి
* రెండవరోజు నిరసన దీక్షలో వక్తలు డిమాండ్

విశాఖపట్నం, ఏప్రిల్ 29: ఒమ్మిరామూర్తి చిట్స్ అండ్ ఫైనాన్స్ బాధితులకు తక్షణమే 27 కోట్లు అసలు పంపిణీ చేయాలని, 2008లో రాష్ట్ర హైకోర్టు ఆర్డరు ప్రకారం అసలు వడ్డీ చెల్లించాలని సిఐటియు విశాఖ నగర ఆర్‌కెవిఎస్ కుమార్, లోక్‌సత్తా పార్టీ విశాఖ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎంఎస్ మూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విఆర్ బాధితులు జీవిఎంసి విగ్రహం వద్ద చేపడుతున్న నిరసనదీక్ష నేడు రెండవరోజు కూడా కొనసాగింది. ఈ దీక్ష శిబిరాన్ని సందర్శించిన కుమార్, మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో ఫైనానర్స్ సంస్థలు అనేక బోర్డు తిప్పివేసి బాధితులకు నష్టం చేకూర్చామని విఆర్ సంస్థ కూడా ఒకటన్నారు. విఆర్ చిట్స్ బాధితులు గత 13 ఏళ్ళు నుండి ఐక్యంగా పోరాడుతూ ఎవరూ సాధించలేని విజయం మీరు సాధించారని అభినందించారు. ఈ సంస్థ ఆస్తులను జప్తుచేసే ఎటాచ్‌మెంట్‌లోకి వచ్చే విధంగా కృషి చేయడం సామాన్యమైన విషయం కాదన్నారు. బాధితులు ఇంత సాధించినా ప్రభుత్వం యాజమాన్య పక్షాన ఉండటం సిగ్గుచేటన్నారు. బాధితులకు అసలు మాత్రమే ఇస్తామని, వడ్డీ అడగొద్దని చెప్పడం వెనుక పెద్ద రాజకీయ కుంభకోణం ఉందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎటాచ్‌మెంట్‌లో ఉన్న మిగిలిన ఆస్తులను అమ్మి తక్షణమే బాధితులకు అసలు, వడ్డీ పంపిణీ చేయాలన్నారు. బాధితులు చేసే న్యాయమైన పోరాటానికి తమ మద్దతు ఎపుడూ ఉంటుందన్నారు.