విశాఖపట్నం

పోర్టు అభివృద్ధికి సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 9: ఎగుమతులు, దిగుమతుల విషయంలో విశాఖ పోర్టు ట్రస్టు (విపిటి) ట్రేడర్లకు అనుకూలంగా సేవలందిస్తోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పోర్టు అభివృద్ధికి సహకరించాలని పోర్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు కోరారు. విపిటి ఆధ్వర్యంలో నగరంలో మంగళవారం నిర్వహించిన ట్రేడర్స్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ పోర్టులో పరిపాలనా పరంగా అన్ని సేవలను ఆన్‌లైన్ చేశామన్నారు. పోర్టులో అందిస్తున్న 42 సేవలు ఇప్పుడు కార్యాలయానికి రానవసరం లేకుండా, ఆన్‌లైన్‌లోనే పొందవచ్చన్నారు. తద్వారా పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఈ ఆఫీస్ ద్వారా పేపర్‌లెస్ సేవలకు పోర్టు ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రస్తుతం కంటైనర్ కార్గో ప్రాధాన్యత పెరుగుతున్న దృష్ట్యా భారీ సరకు రవాణాపై ఛార్జీల్లో పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తున్నామన్నారు. అలాగే పోర్టులో బెర్త్‌ల సామర్ధ్యం దృష్టిలో ఉంచుకుని ఫిప్ అరౌండ్‌ను 3.75 రోజుల నుంచి 3 రోజులకు నియంత్రించామన్నారు. దీనివల్ల పోర్టుకు వచ్చే నౌకలు మూడు రోజుల్లోనే ఎగుమతి, దిగుమతి పూర్తి చేసుకుని తిరిగి వెళ్లేందుకు ఆస్కారమేర్పడిందన్నారు. పోర్టు కనెక్టివిటీ పెంచేందుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ సాగరమాల ప్రాజెక్టు కింద పలు ప్రాజెక్టులు చేపడుతోందన్నారు. డెడికేటెడ్ రోడ్ రవాణా సదుపాయం ఏర్పాటు చేయడం ద్వారా సాధారణ రవాణాపై ఎటువంటి ప్రభావం ఉండదన్నారు. కాలుష్య నియంత్రణ విషయంలో పోర్టు తీసుకుంటున్న పలు చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. క్లీన్ పోర్టుగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ కన్సల్టెంట్‌ను నియమించనున్నట్టు చైర్మన్ వెల్లడించారు. అలాగే సముద్ర పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వ్యర్థాలు, మురుగునీరు రాకుండా చూడాలని జివిఎంసి కమిషనర్‌కు సూచించామన్నారు. చమురు నౌకల్లో సంభవించే ప్రమాదాల వల్ల సముద్ర జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
వాల్తేరు డిఆర్‌ఎం మాధుర్ మాట్లాడుతూ ట్రేడర్స్‌కు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు రైల్వే సిద్ధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు ఎగుమతి, దిగుమతి దారులు, వేదాంత, విసిటిపిఎల్, వైజాగ్ సీపోర్ట్స్, కాంకర్ వంటి సంస్థల ప్రతినిధులు తమ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.