విశాఖ

బక్తులతో మోదమ్మ ఆలయం కిటకిట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, మే 15: స్థానిక మోదకొండమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. పాడేరులో అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారం భం కావడంతో మోదకొండమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. దీంతో పట్టణ వాసులే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల వారు కూడా వందల సంఖ్యలో పాడేరు తరలివచ్చి అమ్మవారికి పూజలు చేసి తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఉత్సవాలు ప్రారంభమైన ఆదివారం రోజే కాకుండా రెండో రోజు సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. అధికంగా తరలివస్తున్న భక్తులతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోవడంతో భక్తులు పెద్ద ఎత్తున క్యూలో నిల్చుని అమ్మవారిని దర్శించుకోవడం కనిపిస్తోంది. అమ్మవారి ఆలయం వద్ద మోహరించిన పోలీసు బలగాలు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుం డా చర్యలు చేపడుతున్నారు. అమ్మవారి ఆలయంతో పాటు కింద బజార్‌లో ఏర్పాటు చేసిన సతకంపట్టు వద్ద కూడా భక్తుల రద్దీ అధికమయ్యింది. అమ్మవారి జాతరలో సతకంపట్టుకు అత్యంత ప్రాధాన్యత ఉందనే చెప్పాలి. ఉత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సతకంపట్టును దర్శించుకోవలసి ఉందనే నియమం ఉండడం తో ఆలయానికి వెళ్లిన వారంతా సతకంపట్టును సందర్శించడం అనవాయితీగా వస్తుంది. దీంతో అమ్మవారి ఆలయం వద్ద ఉన్న భక్తుల రద్దీ సతకంపట్టు వద్ద కూడా కొనసాగుతుంది. సతకంపట్టును సందర్శించే భక్తులు ఇందులో కొలువుతీర్చిన అమ్మవారి ఘటాలు, పాదాలు, ఉత్సవ విగ్రహన్ని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. దీంతో అమ్మవారి ఆలయం, సతకంపట్టు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి.

విలీన గ్రామాలపై జివిఎంసి చిన్నచూపు
అనకాపల్లి(నెహ్రూచౌక్), మే 15: జివిఎంసిలో విలీనం అయిన కొండ కొప్పాక, రాజుపాలెం కొత్తూరు నర్సింగరావుపేట తదితర గ్రామాలు పై జివిఎంసి అధికారులు, ప్రజాప్రతినిధులు చిన్నచూపు చూస్తున్నారు. అనకకాపల్లి పట్టణంతోపాటు అయా గ్రామాలు గ్రేటర్ విశాఖలో వీలీనం అయి సుమారు ఐదు ఎళ్ళు గడుస్తున్నప్పటికీ అక్కడి సమస్యలు ఎక్కడ వెసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉం దని స్థానిక ప్రజలు అరోపిస్తూన్నారు. తాగునీరు, సిసిరోడ్లు, డ్రైనేజీలు తదితర వౌలిక వసతులు కల్పించడంలో జివిఎంసి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ కాలువలు సక్రమంగా లేకపోవడం వలన ఇళ్లలో వాడుకనీరు రోడ్లపై ప్రవహించడం, పంచాయతీ కుళాయిలు మరమ్మతులకు గురికావడంతో తాగునీటికి ప్రజలు కటకటలాడటం, పారిశుద్ధ్య కార్మికులు విధులు సక్రమంగా నిర్వహించకపోవడం వలన రోడ్లపై ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోవడం, సిసి రోడ్లు, కొండ ప్రాంతాలైన ఆయా గ్రామా ల్లో సిసి రోడ్లకు నోచుకోకపోవడం ఇలా అనేక సమస్యలతో అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అనకాపల్లి పట్టణంతోపాటు విలీన గ్రామాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటిస్తున్నారు తప్ప చేతల్లో మాత్రం ఎటువంటి అభివృద్ధి కానరావడం లేదన్నారు. అసలే వేసవికాలం తాగునీటికి నానా అవస్థలు పడుతున్నామన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు సక్రమంగా చెల్లించకపోవడంతో వారు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీంతో రోడ్లపై పేరుకుపోయిన చెత్తతో దోమలు వృద్ధి చెంది ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాయన్నారు. జీవిఎంసిలో ఇంటి పన్నుల వసూళ్లలో మాత్రం పట్టణంతో సమానంగా వసూలు చేస్తున్నారని, అభివృద్ధి విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.