విశాఖ

అగ్నిగుండం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం, మే 15: మండలంలో సోమవారం వీచిన వడ గాల్పులకు జనం విలవిల్లాడిపోయారు. ఉదయం 11 గంటలకే భరించలేని ఎండ వేడిమికి తట్టుకోలేని జనం చెట్లనీడకు పరుగులు తీశారు. అంతేకాకుండా మండలంలోని నారపాడులో అగ్నిప్రమాదం జరిగి సుమారు 9 పూరిళ్ళు దగ్ధం కావటంతో వడగాల్పుల వేడి మరింత రెట్టింపు అయినట్లుగా జనం భావిస్తున్నారు. ఇదిలా ఉండగా సోమవారం మండలంలో పగటి ఉష్ణోగ్రతలు సుమారు 43 డిగ్రీలకు పైబడి ఉంటుందని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పగటి ఉష్ణోగ్రతల సూచి తెలియజేస్తుందని సమాచారం. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అంతేకాదు ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు ఆటోరిక్షాల్లో ప్రయాణికులు ఎన్నో అవస్థలు పడ్డారు. ముఖాలకు స్కార్ప్‌లు కట్టుకుని మహిళలు చీర కొంగులనే ముసుగులుగా పాదచారులు ప్రయాణించటం కనిపించింది. సాయంత్రం 5 గంటలకు కూడా వేడి గాలులు వీయటంతో ప్రజలకు అల్లాడిపోయారు. అయితే విద్యుత్ కోతలు లేని కారణంగా ఇళ్ళలో ఉన్న ప్రజలకు కొంత ఉపశమనం కలిగించినట్లయింది.